Guppedantha Manasu 02 August 2022 Episode : సాక్షి నిన్ను రిషి పెళ్లి చేసుకోనన్నాడు.. నీకు చేతనైంది చేసుకోపో అన్న దేవయాని..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guppedantha Manasu 02 August 2022 Episode : సాక్షి నిన్ను రిషి పెళ్లి చేసుకోనన్నాడు.. నీకు చేతనైంది చేసుకోపో అన్న దేవయాని..!

 Authored By prabhas | The Telugu News | Updated on :2 August 2022,11:00 am

Guppedantha Manasu 02 August 2022 Episode : జగతి రిషి దగ్గరకు వచ్చి వసుధార గురించి మీరు మాట్లాడద్దు అని అన్నారు.. కానీ తన మనసులో మీపైన చాలా ప్రేమ ఉంది అని చెబుతుంది.. నా జీవితంలోకి వచ్చిన ఆడవాళ్లు ప్రతి ఒక్కరూ నన్ను మోసం చేసి వెళ్తారు.. చిన్నతనంలో నా కన్నతల్లి వదిలేసి వెళ్ళిపోయింది.. పెళ్లి బంధంతో వచ్చిన సాక్షి వచ్చింది తను వెళ్లిపోయింది.. ప్రేమ బంధంతో ఇప్పుడు వసు వచ్చింది తను కూడా నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది అని జగతి తో అంటాడు రిషి.. ఇంట్లో అందరినీ దేవయాని కూర్చోబెట్టింది.. రా రిషి నీ కోసమే వెయిటింగ్.. ఏంటి పెద్దమ్మ ఏం మాట్లాడాలి అని రిషి అడుగుతాడు.. అవునన్నా ఇది మన ఇంటికి కుటుంబానికి సంబంధించిన సమస్య సాక్షి గురించి మాట్లాడడానికి రమ్మన్నాను.. పెద్దమ్మ సాక్షిది అసలు సమస్య కాదు.. అదేంటి రిషి తను మొన్న చదువుల పండగలో ప్రెస్ వాళ్లకు చెప్పింది కదా అని దేవయాని అంటుంది.. పెద్దమ్మ తన ఆలోచన ఏదో తన చెప్పుకుంది..

అంతే అని రిషి అంటాడు. తన ఆశలకు ఆలోచనలకు మనకు ఏం సంబంధం ఏం ఉంది పెద్దమ్మ అని రిషి దేవయానిని నిలదీస్తాడు.. సాక్షి.. సాక్షి.. సాక్షి.. ఎవరు పెద్దమ్మ ఈ సాక్షి.. అసలు ఈ సాక్షి ఎవరూ.. తనకి మనకి ఏంటి సంబంధం.. తనతో ఎంగేజ్మెంట్ ఎప్పుడో బ్రేకప్ అయ్యింది.. ఇక సాక్షి ఏమనుకుంటుంది అనేది తన వ్యక్తిగతం.. వాటితో మనకు ఎలాంటి సంబంధం లేదు.. అని అంటాడు రిషి.. కానీ రిషి సాక్షి అలా ప్రెస్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు నువ్వు ఏం మాట్లాడలేదు అని దేవయాని అనగానే.. కాలేజ్ పరువు కోసం ఏం మాట్లాడలేదు అని రిషి అంటాడు.. అందరూ ఉన్నారు.. మౌనంగానే ఉన్నానని ఎవరు ఆ టాపిక్ గురించి ఇంకా మాట్లాడలేదు.. సాక్షి ఆశపడడంలో తప్పేముంది అని దేవయాని అడుగుతుంది. పెద్దమ్మ మీరు అంటే నాకు గౌరవంగా ఉంది. సాక్షిని పాపం అనడం అది మీ మంచితనం.. అసలు ఆ సాక్షి ఏం చేసిందో మీకు తెలుసా..

Guppedantha Manasu 02 August 2022 Full Episode

Guppedantha Manasu 02 August 2022 Full Episode

ఒకరోజు లైబ్రరీలో అలారం మోగింది కదా ఆరోజు అందరినీ పిలిపించి తనే కావాలని ఇలా ఇద్దరం ఒకే చోట ఉండేలా చేసామని చెబుతానని నన్ను బెదిరించింది.. చదువుల పండగ ఫంక్షన్ లో కొన్ని ఫోటోలు పంపించి.. వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసింది.. అని అసలు విషయాన్ని దేవయాని ముందు కొండ బద్దలు కొడతాడు రిషి.. రేపటి ఎపిసోడ్ లో వసుధరా దగ్గరకు రిషి వెళ్తాడు.. రిషి వసుధర చేతిని పట్టుకొని నువ్వు ఏం మాట్లాడుకోకుండా నాతో పాటు రా అని అంటాడు.. అంతలో సాక్షి రిషికి ఫోన్ చేస్తుంది.. ఎక్కడ ఉన్నావ్ రిషి అని అడుగుతుంది.. వసుధరా ఉన్నాను అని చెబుతాడు.. వెంటనే సాక్షి దేవయాని ఇంటికి వస్తుంది.. ఆంటీ రిషి కి ఈ పెళ్లి అంటే ఇష్టమా కాదా అని నాకు అర్థం కావడం లేదు అని అంటుంది.. సాక్షి కి దేవయానినే స్వయంగా రిషికి ఈ పెళ్లి ఇష్టం లేదని సాక్షితో చెప్పేస్తుంది.. రిషి నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు.. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటుంది దేవయాని..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది