Guppedantha Manasu 02 Dec Today Episode : గౌతమ్ ఇంట్లోనే మహీంద్రా ఉన్నాడని తెలుసుకొని రిషి షాక్.. గౌతమ్ ను ఏం చేస్తాడు? మహీంద్రాకు ఈ విషయం తెలుస్తుందా?

Authored By Varun G | The Telugu News | Updated on : 2 December 2022, 9:00 am

Guppedantha Manasu 02 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు డిసెంబర్ 2, 2022 శుక్రవారం ఎపిసోడ్ 623 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది జీవితాలను ఎక్కడెక్కడో వెతుక్కుంటారు. కానీ మనసెరిగిన వాడు పక్కనుండగా ఇలా చేయి పట్టుకొని ఈ నిశ్శబ్దంలో ఆకాశం కింద ఇలా గడిపే క్షణాలు గొప్పవి. ఇంకేం ఉంటాయి చెప్పండి అంటుంది వసుధార. దీంతో ప్రేమ అంటే ఏంటి అని అడుగుతాడు రిషి. దీంతో ప్రేమంటే ఆకాశం అంటుంది వసుధార. దీంతో ప్రేమంటే రిషిధార అంటాడు రిషి. దీంతో అలాగే ఉండనివ్వండి సార్. అలా ఉండని రోజు ఈ వసుధార ఉండదు అని అంటుంది వసుధార. ఆ తర్వాత రిషిని గట్టిగా హత్తుకుంటుంది. రిషి కూడా తనను గట్టిగా హత్తుకుంటాడు. ఇద్దరూ ప్రేమలో మునిగిపోతుండగా.. అప్పుడే కొంటె కుర్రాళ్లు వచ్చి హేయ్ లవ్ బర్డ్స్ అంటారు. దీంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు.

guppedantha manasu 02 december 2022 full episode

guppedantha manasu 02 december 2022 full episode

వసుధారను వెనక్కి నెట్టి.. ముందుకెళ్తాడు రిషి. ఏంటి ప్రేమ పక్షులకు రూమ్ దొరకలేదా. ఇక్కడే ఉన్నాయి అంటారు వాళ్లు. దీంతో వాళ్లపై కోపంగా ఉంటాడు. వాళ్లను కొడతాడు రిషి. ఇంతలో పోలీసుల సైరన్ వినిపించడంతో వాళ్లు పారిపోతారు. వాళ్లతో పెనుగులాటలో రిషి షర్ట్ పాడవుతుంది. షర్ట్ మీద మందు పడుతుంది. దీంతో ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. కానీ.. ఇంటికి వద్దు.. గౌతమ్ సార్ ఇంటికి వెళ్దాం అంటుంది వసుధార. అక్కడ షర్ట్ మార్చుకొని వద్దా అంటుంది. దీంతో గౌతమ్ ఇంటికి వెళ్తారు ఇద్దరూ. గౌతమ్ డోర్ ఓపెన్ చేయి అనగానే టెన్షన్ పడతాడు గౌతమ్. ఆ తర్వాత డోర్ తీస్తాడు గౌతమ్. డోర్ తీయడానికి ఇంత సేపా అని అడుగుతాడు. ఆ తర్వాత ఏమైంది.. అంటాడు. షర్ట్ మార్చుకోవాలి అంటాడు. దీంతో వెళ్లి రూమ్ లో మార్చుకో అంటాడు గౌతమ్. దీంతో రూమ్ లోకి వెళ్లి షర్ట్ వేసుకుంటాడు రిషి.

మరోవైపు వెళ్లిపోయిందనుకున్న జగతి మళ్లీ వచ్చింది అని టెన్షన్ పడుతుంది దేవయాని. ధరణి ఇక్కడుంది ఏంటి.. వసుధార కనిపించడం లేదేంటి. వసుధార ఈ రూమ్ లోనే కదా ఉండాలి. లేదేంటి అని అనుకుంటుంది దేవయాని. బయట చూస్తే కారు కూడా ఉండదు. దీంతో షాక్ అవుతుంది.

ఇద్దరూ ఈ రాత్రి పూట బయటికి వెళ్లారన్నమాట. వసుధార ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు. ఈ టైమ్ లో బయటికి తీసుకెళ్లడం ఏంటో. వసుధార నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. నీ సంగతి తర్వాత చెప్తాను అని అనుకుంటుంది దేవయాని.

మరోవైపు టీషర్ట్ వేసుకొని బయటికి వస్తాడు రిషి. ఏంట్రా ఈ అవతారం. మంచిది ఏదైనా వేసుకో అంటే వినడు. నా ఇష్టం అంటాడు. దీంతో నీ ఇష్టం. ఏదైనా చేసుకో అంటాడు గౌతమ్. ఆ తర్వాత వసుధార వెళ్దామా అంటాడు. దీంతో సరే వెళ్దాం అంటుంది. ఇంతలో నా ఫోన్ మరిచిపోయా అంటాడు.

లోపలికి వచ్చి తన ఫోన్ తీసుకోబోయి అక్కడే ఉన్న పర్ ఫ్యూమ్, వాచ్ చూస్తాడు. డాడ్ వాచ్ ఇక్కడుందేంటి అని అనుకుంటాడు. ఈ వాచ్ ను డాడ్ కు నేను గిఫ్ట్ గా ఇచ్చా కదా అనుకుంటాడు. అప్పుడు గిఫ్ట్ గా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు రిషి.

Guppedantha Manasu 02 Dec Today Episode : గౌతమ్ ఇంట్లో ఫోటో చూసి షాకయిన రిషి

ఈ వాచ్ చూసినప్పుడల్లా నేను మీకు గుర్తొస్తాను అంటాడు రిషి. అసలు నిన్ను మరిచిపోతే కదా అంటాడు మహీంద్రా. నీకంటూ ఉన్న ప్రతిదీ నాకివ్వాలనిపిస్తోంది కదా రిషి అంటాడు మహీంద్రా. అప్పటి విషయాలన్నీ గుర్తు చేసుకుంటాడు. ఈ వాచ్ ను  గౌతమ్ గాడికి గిఫ్ట్ గా ఇచ్చాడా? ఈ వెధవ ఫోర్స్ చేసి డాడ్ దగ్గర తీసుకున్నా తీసుకుంటాడు అని అనుకుంటాడు.

ఆ తర్వాత అక్కడే మహీంద్రా, రిషి ఇద్దరూ కలిసి దిగిన ఫోటో కనిపిస్తుంది. దీంతో రిషికి ఏం చేయాలో అర్థం కాదు. ఈ ఫోటో ఇక్కడుందంటే డాడ్ వాళ్లు ఇక్కడే ఉన్నారు అని అనుకుంటాడు రిషి. ఇంతలో కోపం వచ్చి ఒరేయ్ గౌతమ్ అని పిలుస్తాడు రిషి.

రేయ్.. ఏంట్రా ఇది అని ఫోటో చూపిస్తాడు. దీంతో గౌతమ్ షాక్ అవుతాడు. ఏంట్రా ఇవి అంటాడు. మాట్లాడుకు. డాడ్ వాళ్లు ఇన్నాళ్లు ఇక్కడే ఉన్నారు కదా అంటాడు రిషి. దీంతో గౌతమ్ కు ఏం మాట్లాడాలో అర్థం కాదు. మేడమ్ కు, డాడ్ కు నీ ఇంట్లోనే షెల్టర్ ఇచ్చి నా దగ్గరికి వచ్చి ఏం తెలియనట్టు ఎంత బాగా నటించావురా అంటాడు రిషి.

సర్.. మేడమ్ వాళ్లు ఇక్కడ ఉండటం ఏంటి సార్ అంటుంది వసుధార. దీంతో అదే కదా విచిత్రం వసుధార అంటాడు రిషి. వీడు నా ఫ్రెండ్. గొప్ప స్నేహం మాది. అందుకే డాడ్ వాళ్లు వాళ్ల ఇంట్లో ఉన్నా నాకు చెప్పలేదు. ఎంత అందమైన మోసంరా ఇది అంటాడు రిషి.

రేయ్ రిషి సారీరా అంటాడు. నేనేంటో తెలిసి కూడా ఇంత మోసం చేశావు కదరా అంటాడు రిషి. ఇంత మోసమా.. ఇంత ద్రోహమా అంటాడు. డాడ్ కోసం పిచ్చోడిలా మారిపోయాను కదరా. ఎంత బాగా నటించావురా. వెళ్లి కంప్లయింట్ ఇద్దామంటే వద్దన్నావు. ఫ్యామిలీ అన్నావు. పరువు అన్నావు. గొప్ప ఫ్రెండ్ విరా నువ్వు అంటాడు.

నేను చెప్పాలనుకున్నా కానీ.. అంటే నువ్వు ఏం చెప్పినా నేను వినను అంటాడు రిషి. రేయ్ గౌతమ్ నీకు వంద కారణాలు ఉండొచ్చు కానీ.. నీ ఫ్రెండ్ ను కదరా. ఇంత మోసం ఎలా చేశావురా అంటాడు రిషి. దీనికన్నా నన్ను కత్తితో పొడిచి చంపేసి ఉంటే చాలా బాగుండేది అంటాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

  1. "Heavy Rain Alert : బిగ్ బ్రేకింగ్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్..!"

  2. "Talliki Vandanam 2026 : ఏపీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. తల్లికి వందనం నిధులు విడుదల.. మీ డబ్బులు వచ్చాయో ఇలా చెక్ చేసుకోండి"

  3. "Fact Check PM KISAN : పీఎం కిసాన్ లేటెస్ట్ అప్‌డేట్‌.. రూ.6,000 పెంపుపై కేంద్రం ఫుల్ క్లారిటీ..!"

  4. "karthika Deepam 2 Today Episode 2026 July 22 : సుమిత్ర ఒక్క ప్రశ్నతో షాక్‌లో సూరజ్.. అసలు నిజం బయటపడబోతోందా?"

  5. "Gold Rate Today : బంగారం కొనేవారికి షాక్.. ఒక్కరోజులో పెరిగిన పసిడి ధరలు.. జూలై 22 రేట్లు ఇవే!"

  6. "Chicken vs Mutton : వర్షాకాలంలో నాన్‌వెజ్ తింటున్నారా? చికెన్, మటన్‌లో ఏది సేఫ్?"

  7. "Tholi Ekadashi : తొలి ఏకాదశి మహిమ.. ఈ 4 రాశుల వారి ఇంట డబ్బే డబ్బు.. విష్ణుమూర్తి ప్రత్యేక కటాక్షం!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి