Guppedantha Manasu 03 August 2022 Episode : దేవయానినీ అడ్డంగా బుక్ చేసిన రిషి.. సాక్షికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన దేవయాని..

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: August 3, 2022, 10:30 am

Guppedantha Manasu 03 August 2022 Episode : రిషి వాళ్ల పెద్దమ్మ దేవయానికి సాక్షి వసుధరను అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తుందని చెబుతాడు.. పెద్దమ్మ తను ఆత్మహత్య చేసుకుంటుంది అని నువ్వు చెప్పావు కాబట్టి.. నీ మీద ఉన్న ప్రేమతో తనను ఇంట్లోకి రావడానికి ఒప్పుకున్నాను.. నీకోసం తనతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను.. కాస్త రిలాక్స్ అవుతుందని కాలేజ్ లోకి రావడానికి ఒప్పుకున్నాను.. అంత మాత్రం చేత తన మీద ప్రేమ ఉన్నట్టు కాదు.. ఈ విషయాన్ని తనకు అర్థమైయేటట్టు మీరే చెబుతారని అనుకుంటున్నాను.. నా మీద ఉన్న ప్రేమ కోసం అయినా మీరు ఈ విషయాన్ని తనతో చెబుతారని అనుకుంటున్నాను అని రిషి అంటాడు.. అవును రిషి దేవయానిని సాక్షి కి ఓ విధంగా హెల్ప్ చేసింది.. ఇప్పుడు తనే ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి అని వాళ్ళ పెద్దనాన్న అంటాడు.. అందరూ కలిసి దేవయానిని సాక్షికి సపోర్ట్ చేస్తుంది అని రిషి ముందు అడ్డంగా బుక్ చేస్తారు.. ఇక దేవయాని ఏం చేయలేక సరే అని అంటుంది..

వసుధర ఎందుకు ఏంటి అని మాట్లాడకు నాతో రా అని తన చెయ్యి పట్టుకుని రిషి తనతో పాటు తీసుకు వెళ్తాడు.. ఇద్దరు కలిసి కార్ లో వెళ్తారు.. ఏం ఆలోచిస్తున్నావు అని రిషి అంటాడు.. అంతలో రిషి సడన్ గా రోడ్డు మీద ఆగిపోతుంది.. ఇప్పుడు మనం వెనక్కి ఎలా వెళ్తాము సార్ అని అడుగుతుంది.. జీవితమైనా ఏదైనా ఎక్కడో ఒక చోట నుంచి మార్పు మొదలు అవ్వలిగా అని రిషి అంటాడు..ఆంటీ ఆంటీ అని సాక్షి ఇంట్లోకి వస్తుంది. ఏంటి సాక్షి ఇలా వచ్చావు అని దేవయాని అడుగుతుంది. నాకు సమాధానం కావాలి ఆంటీ అని సాక్షి అంటుంది.. నేను ఈ ఇంటికి కాబోయే కావడం అవునా కాదా అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని సాక్షి అంటుంది.. ఏమైంది సాక్షి అని జగతి అంటుంది.. రిషి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా.. ఎక్కడికో వెళ్తున్నాడు ఎక్కడికి అంటే చెప్పడం లేదు.. నేను ఫోన్ చేస్తే ఒక్క ముక్కలో ఆన్సర్ చెప్పి కట్ చేశాడు.. మళ్ళీ కాల్ చేస్తే తీయడం లేదు.. అసలు ఏంటి ఆంటీ.. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు.. పెళ్లి చేసుకుంటుంది నన్ను..

Guppedantha Manasu 03 August 2022 Full Episode

Guppedantha Manasu 03 August 2022 Full Episode

జీవితాంతం కాపురం చేయాల్సింది.. నాతో షికార్లకు వెళ్లాలంటే నాతో వెళ్ళాలి.. ఆ వసుధారతో వెళ్లడం ఏంటి.. అసలు రిషికి ఈ పెళ్లి ఇష్టం ఉందో లేదో నాకు తెలియడం లేదు అని సాక్షి అందర్నీ నిలదీస్తూ అడుగుతుంది.. నేను ఇప్పుడే చెబుతున్నాను అంటే రిషి పద్ధతి మార్చుకోవాలి.. రిషి ఇలా చేయడం బాగోలేదు అని సాక్షి అంటుండగా.. జగతి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా.. నీకు రిషికి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు మీరు తేల్చుకోవాలి..జగతి నువ్వు ఉండు నేను మాట్లాడతాను అని దేవయాని అంటుంది.. చెప్పు సాక్షి నీ ప్రాబ్లమ్ ఏంటి అందరి ముందు నేను మా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది.. పెళ్లి చేసుకుంటున్నాం.. అన్న కూడా తను ఏం మాట్లాడటం లేదు అని సాక్షి చెబుతుంది.. ఇప్పుడు కూడా రిషి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు.. నన్ను గుర్తించడం లేదు అని అనగానే..

రిషి ప్రెస్ మీట్ అప్పుడు ఏం మాట్లాడలేదు అని అంటే అర్థం ఏంటి అని దేవయాని అడుగుతుంది.. ఏం మాట్లాడలేదు అంటే ఇష్టం అనేగా అర్థం అని అంటుంది.. అవును అని నువ్వు ఎలా అనుకుంటావు అని దేవయాని నిలదీస్తుంది.. కాలేజీలో అందరి ముందు ఈ విషయం మాట్లాడకుండా తర్వాత నీతో పర్సనల్ గా మాట్లాడదామని అనుకొని కూడా ఉండొచ్చు కదా నువ్వు అలా ఎందుకు ఆలోచించడం లేదు అని దేవయాని అడుగుతుంది.. అంత మాత్రన రిషి ఒప్పుకున్నట్టు కాదు కదా అని అంటుంది..ఏంటి ఆంటీ మీరు కూడా రిషికి సపోర్ట్ చేస్తున్నారు అని సాక్షి అడుగుతుంది.. సపోర్ట్ చేయడం కాదు సాక్షి రిషి కి నువ్వంటే ఇష్టం లేదు.. రిషి నిన్ను ప్రేమించడం లేదు.. నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు.. అని దేవయాని కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడింది.. మిగతా విశేషాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం..

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp