Guppedantha Manasu 7 Jan Today Episode : సుమిత్రిను చంపబోయిన రాజీవ్.. కాపాడిన రిషి.. రాజీవ్ అసలు స్వరూపం తెలుసుకున్న చక్రపాణి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guppedantha Manasu 7 Jan Today Episode : సుమిత్రిను చంపబోయిన రాజీవ్.. కాపాడిన రిషి.. రాజీవ్ అసలు స్వరూపం తెలుసుకున్న చక్రపాణి

 Authored By gatla | The Telugu News | Updated on :7 January 2023,9:00 am

Guppedantha Manasu 7 Jan Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 జనవరి 2023, శనివారం ఎపిసోడ్ 654 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దాబా దగ్గర కూర్చొని వసుధార గురించే ఆలోచిస్తూ ఉంటాడు రిషి. తనకు ఏం అర్థం కాదు. మరోవైపు వసుధార వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది జైలులో. వసుతో ఉన్న మెమోరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటాడు రిషి. మరోవైపు తన తాళి, రింగ్ ను చూస్తూ ఉంటుంది. వసుధార నన్నేం చేద్దామనుకున్నావు. నేను ఏమైపోవాలనుకున్నావు అని అనుకుంటాడు రిషి. బంధం అనుకుంటే భ్రమ అయ్యావు వసుధార. నేను ఏం అడిగినా చెప్పవు. వసుధార నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉన్నావు. మీ అమ్మానాన్న ఆసుపత్రిలో ఉన్నారు. నువ్వు వెళ్లిపో అంటే నేను వెళ్తా అనుకున్నావా? రిషిధారలో నుంచి రిషి విడిపోడు. నిన్ను విడిపోనివ్వడు. బాధ, బాధ్యత రెండు వేర్వేరు. ఒకదానితో ఇంకోటి కలవవు.. అనుకుంటాడు.

guppedantha manasu 07 january 2023 full episode

guppedantha manasu 07 january 2023 full episode

మరోవైపు ఆసుపత్రిలో ఉంటారు చక్రపాణి, సుమిత్ర. మరోవైపు వాళ్లకు రక్షణగా ఉన్న పోలీసులు క్యాంటిన్ కు వెళ్తారు. ఇంతలో అక్కడికి రాజీవ్ వస్తాడు. వాళ్లను చూస్తాడు. అరెరె.. ఎంత పని అయిపోయింది. ఒక వైపు మామయ్య గారు. ఇంకోవైపు అత్తయ్య గారు. అత్తయ్య గారి శరీరానికి గాయం అయింది. మామయ్య గారికి మనసు చెదిరిపోయింది. ఎంత పని అయిపోయింది మామయ్య. ఎంత పని అయిపోయింది అత్తయ్య అని అనుకుంటాడు. మామయ్య గారు.. కళ్లు తెరవండి. మీ అల్లుడు రాజీవ్ వచ్చాడు అంటాడు. కానీ.. చక్రపాణి కళ్లు తెరవడు. బతికే ఉన్నాడు. మీ లాంటి మామయ్య నాకు దొరకడం నా అదృష్టం మామయ్య గారు. మీరు నన్ను నమ్మినంత కాలం అల్లుడు నెంబర్ వన్ అనే హోదాలోనే ఉన్నాను. డబ్బులు విసిరేసి నేను బెస్ట్ హోదాలో ఉన్నాను. ఆ హోదాను నేను నిలబెట్టుకుంటాను.

ఇక సమస్య అల్లా అత్తయ్య గారితో. అయ్యయ్యో అత్తయ్య గారు. మీరు ఇన్నాళ్లకు నాకు ఉపయోగపడ్డారు. మీ త్యాగమే నా పెళ్లికి ఉపయోగపడుతుంది. మీరు త్యాగం చేయండి అత్తయ్య గారు. మీరు చస్తారనుకున్నా. కానీ.. చావలేదు.

రేపో మాపో లేచి కూర్చొంటారు. తర్వాత జరిగేది ఏంటంటే.. జరిగింది మొత్తం మామయ్య గారితో చెప్పేస్తారు. ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి అత్తయ్య గారు. మిమ్మల్ని పొడిచింది నేనే అని అందరికీ తెలిస్తే అందరూ నన్ను ఏమనుకుంటారు.

మామయ్య గారు నన్ను ఆదర్శ పురుషుడు అని అనుకుంటున్నారు. అనవసరంగా నేను జైలుకు వెళ్తాను కదా అనుకుంటాడు. మీరు బతికి నన్ను జైలుకు పంపిస్తారా? మీరు బతకడం అవసరమా? మీరు బతికినా నాకు సపోర్ట్ చేయరు. పుణ్యస్త్రీగా వెళ్లిపోయే వరాన్ని మీకు ప్రసాదిస్తాను సరేనా అంటూ తన మూతి మీద ఉన్న మాస్క్ ను తీసేస్తాడు రాజీవ్.

Guppedantha Manasu 7 Jan Today Episode : ఆసుపత్రికి వచ్చి చక్రపాణి, సుమిత్రను చూసిన రిషి

అదే సమయంలో ఆసుపత్రికి వస్తాడు రిషి. అత్తయ్య గారు మీరు నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చివరగా మీకు ఏదైనా కోరిక ఉంటే నాకు చెప్పండి. నాకు, వసుకు పాప పుడితే మీ పేరే పెట్టుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. హ్యాపీ జర్నీ అత్తయ్య గారు అంటాడు రాజీవ్.

ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే.. చక్రపాణి స్పృహలోనే ఉంటాడు కానీ.. రాజీవ్ ముందు స్పృహలో లేనట్టు నటిస్తాడు. మాస్క్ తీసి వెళ్లిపోయాక కళ్లు తెరుస్తాడు. బెడ్ మీద కొట్టుకుంటున్న సుమిత్రను చూస్తాడు చక్రపాణి.

ఇంతలో అక్కడికి వచ్చిన రిషి.. బెడ్ మీద ఆమె కొట్టుకోవడం చూస్తాడు. వెంటనే రూమ్ లోకి వెళ్లి తనకు మాస్క్ పెడతాడు రిషి. ఒక్క నిమిషం అని చెప్పి డాక్టర్ ను తీసుకొస్తాడు. ఆక్సిజన్ మాస్క్ పెట్టలేదు ఏంటి.. అని ప్రశ్నిస్తాడు రిషి.

ఎంత ఖర్చయినా పర్వాలేదు. మంచి ట్రీట్ మెంట్ ఇప్పించండి. నేనున్నాను అంటాడు రిషి. ఇంతలో అక్కడికి రాజీవ్ మళ్లీ వస్తాడు. సుమిత్రకు మాస్క్ పెట్టి ఉండటం చూస్తాడు. నువ్వేంటి ఇక్కడ అంటాడు రాజీవ్.

దీంతో వీళ్లను చూసుకునే బాధ్యత నాకు కూడా ఉంది కదా అంటాడు రిషి. దీంతో నీకు వసుధార అమ్మానాన్నలు, నాకు అత్తామామలు అంటాడు. అయినా నీ కారణంగానే వసుధార వాళ్ల అమ్మను పొడిచి వసుధార జైలుకు వెళ్లింది అంటాడు రాజీవ్.

ఈ రిషి కారణంగానే ఇదంతా జరిగింది. ముందు ఈయన్ను బయటికి పంపించండి అని డాక్టర్ తో అంటాడు రాజీవ్. మీరు వెళ్లిపోండి సార్ అంటాడు డాక్టర్. భలే బతికావ్ అత్తయ్య. నీకు అలా కలిసివచ్చింది అని అనుకుంటాడు రాజీవ్.

మరోవైపు రూమ్ లో జగతి, మహీంద్రా ఇద్దరూ టెన్షన్ పడుతుంటారు. ఏంటి జగతి ఇది అంటాడు మహీంద్రా. నాకు ఏం అర్థం కావడం లేదు. ఒక మనిషిని ప్రేమిస్తే రిషి మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. వసుధారను అంతగా ప్రేమించాడు. ఇప్పుడు రిషి గుండెలు బద్దలు అయ్యేలా వసుధార చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం జగతి అంటాడు మహీంద్రా.

దీంతో ఒకసారి రిషికి ఫోన్ చేయ్ అంటుంది జగతి. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అంటాడు మహీంద్రా. చిన్నప్పుడు నేను దూరం అయినా తట్టుకున్నాడు. దానికి నీ ప్రేమే కారణం అంటుంది జగతి.

రిషి జీవితంలోకి వసుధార వచ్చాక తనలో గొప్ప మార్పు వచ్చింది. సాక్షి చేసిన ఘోరాన్ని కూడా మరిచిపోయాడు. వసుధారనే లోకం అనుకున్నాడు అంటాడు మహీంద్రా. ఇక్కడ ఉండి కూడా మనం ఏం చేయగలం. మనం ఇంటికి వెళ్లిపోదాం అంటాడు మహీంద్రా.

దీంతో జగతి, మహీంద్రా ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. రిషి ఇంటికి వచ్చాడేమో అనుకుంటారు. కానీ.. ధరణి మాత్రం రిషి ఇక్కడికి రాలేదు అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సేందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది