Guppedantha Manasu 16 Aug Today Episode : రిషితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సాక్షి.. వసుధర షాక్.. రిషి నిశ్చితార్థం వసుధరతో జరుగుతుందా?
Guppedantha Manasu 16 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 ఆగస్టు 2022, మంగళవారం ఎపిసోడ్ 530 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి చేయించిన రింగ్ చూసి షాక్ అవుతుంది. ఆ రింగ్ మీద అక్షరం ఏముందో తెలుసా అని అందరికీ చూపిస్తుంది సాక్షి. వీ అని ఉంది అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. చూడండి అంటుంది. వీ అని రాయించారు అంటుంది సాక్షి. ఏంటి ఆంటి ఇది. నా పేరు సాక్షి. ఎస్ అంటే సాక్షి అని ఉండాలి కదా.. వీ అని ఎందుకు ఉంది. చెప్పండి ఆంటి అంటుంది. రిషి ఏంటిది. ఉంగరం మీద ఎస్ అని ఉండాలి కదా. వీ అని ఎలా రాయించావు అని అంటుంది సాక్షి. దీంతో అది.. సారీ అంటాడు రిషి. దీంతో సారీనా. ఏంటి రిషి సారీనా.. అంటుంది. కాబోయే భార్యను నా పేరులోని మొదటి అక్షరాన్ని మరిచిపోయావా అంటుంది సాక్షి. దీంతో అనుకోకుండా అలా అయింది అంటాడు కానీ సాక్షి వినదు.
అనుకోకుండా జరిగిందా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు రిషి. నా పేరు మరిచిపోయావా? లేక వసుధర ప్రేమను మరవలేకుండా ఉన్నావా అంటుంది సాక్షి. దీంతో సాక్షి అంటూ తన మీద సీరియస్ అవుతాడు రిషి. ఇప్పుడు గుర్తొచ్చిందా నా పేరు అంటుంది. జీవితాంతం నువ్వు నన్ను సాక్షి అని పిలుస్తావో.. వసుధర అని పిలుస్తావో భయపడుతూ బతకాలా అంటుంది. తన తల్లిదండ్రులు ఇలా మాట్లాడకు అన్నా కూడా సాక్షి వినదు. ఇది ఉంగరంలోని అక్షరంతోనే ఆగదు. ఇది తన మనసులో ముద్రించుకుపోయింది అంటుంది సాక్షి. పొరపాటు జరిగిందని చెబుతున్నాడు కదా అని ఎంత చెప్పినా సాక్షి వినదు. లేదు.. ఆమె పేరునే జపిస్తున్నాడు. తన మనసులో నేను లేను. తన ఆలోచనల్లో నేను లేను. మనసంతా అదిగో ఆ వసుధర మీదే ఉంది అంటుంది సాక్షి.
వసుధర.. వసుధర.. వసుధర.. ఈ పేరు వింటుంటేనే కంపరంగా ఉంది. ఈ పేరుతోనే నేను జీవితాంతం బతకాలా? చెప్పండి.. ఈ కంపరంతోనే జీవితాంతం నేను కాపురం చేయాలా.. ప్రతిక్షణం నేను తనకు వసుధర లాగానే కనిపిస్తాను. తను నన్ను మానసికంగా చంపేస్తాడు. ఈ పెళ్లి నాకు వద్దు అంటూ ఆ ఉంగరాన్ని విసిరికొడుతుంది సాక్షి. దీంతో మహీంద్రా ఊపిరి పీల్చుకుంటాడు.
Guppedantha Manasu 16 Aug Today Episode : ఈ నరకం నాకొద్దు అని అందరి ముందే చెప్పేసిన సాక్షి
ఆ ఉంగరం వెళ్లి వసుధర కాళ్ల దగ్గర పడుతుంది. ధరణి, గౌతమ్ కూడా సంతోషిస్తారు. ఈ నరకం నాకొద్దు అంటుంది సాక్షి. అమ్మా సాక్షి అని దేవయాని ఏదో చెప్పబోతుండగా సారీ ఆంటి ఇది జరగదు అంటుంది సాక్షి. ఈ పెళ్లి చేసుకోకపోతే నేను ఒక్కసారే ఏడుస్తాడు. కానీ జరిగితే జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి అంటుంది సాక్షి.
ఏంటమ్మా ఇది. ఇన్నాళ్లు రిషిని కోరుకున్నావు. ఇప్పుడు వదులుకుంటా అంటున్నావేంటి అంటాడు తన డాడీ. కానీ.. అస్సలు వినదు. నీ గురించి అందరూ అంటుంటే ఏదో అనుకున్నాను. తల్లిని కాదనుకున్నావంటే ఆంటిదే తప్పు అనుకున్నాను. వసుధర నిన్ను ఎందుకు కాదనుకుందో పిచ్చిది అనుకున్నాను.
కానీ.. .ఇప్పుడు తెలిసింది. నిన్ను ఎందుకు కాదనుకుందో. నీకు ప్రేమించడం రాదు అంటుంది సాక్షి. నీకు ప్రేమ విలువ తెలియదు అంటుంది సాక్షి. జగతి ఆంటి.. మీరు సూపర్. మీరు చెప్పిందే కరెక్ట్.. అంటుంది సాక్షి. దీంతో ఏయ్ జగతి.. ఏం చెప్పావు. ఏం చెప్పి సాక్షి మనసు విరిగేలా చేశావు అని అడుగుతుంది దేవయాని.
దీంతో జగతి ఆంటి నా మనసు విరగ్గొట్టలేదు. రిషి మనసులో నువ్వు లేవని నాకు ముందే చెప్పారు కానీ.. నేనే వినలేదు. డాడీ, మమ్మీ పదండి అని అంటుంది సాక్షి. ఆవేశం తగ్గించుకో సాక్షి అంటుంది దేవయాని. కానీ.. మీకో దండం, మీ పెంపకానికో దండం, మీ అబ్బాయికో దండం అంటుంది సాక్షి.
తప్పు చేస్తున్నావు. జీవితాంతం బాధపడతావు అని అంటుంది దేవయాని. దీంతో బాధపడటం కాదు.. జీవితాంతం సంతోషిస్తాను అంటుంది సాక్షి. నీకు ఏమైంది అని అంటాడు రిషి. దీంతో నాకు బుద్ధి వచ్చింది. కళ్లు తెరుచుకున్నాను అంటుంది సాక్షి.
తర్వాత కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది సాక్షి. తన కాళ్ల దగ్గర పడిన ఉంగరాన్ని తీసుకుంటుంది వసుధర. ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోతుండగా సాక్షి అడ్డుపడుతుంది వసుధరకు. ఏంటి వసుధర.. హ్యాపీయేనా. నా లైఫ్ నాశనం అయింది. సాక్షి లైఫ్ అవుట్ కదా.
రిషి నాకు దక్కాలని, తనతో జీవితం పంచుకోవాలని ఎంతో తపించాను. ఇప్పుడు అన్నీ అయిపోయాయి. నువ్వు హ్యాపీ కదా. నువ్వు మాట్లాడలేదంటే మనసులో సంతోషిస్తున్నావా. మనసు ఆనంద తాండవం చేస్తుందా అని నిలదీస్తుంది సాక్షి. దీంతో నువ్వే వద్దనుకున్నావు కదా. ఇందులో ఎవ్వరినీ తప్పుపట్టలేం అంటుంది వసుధర.
ఒకరి గెలుపు కోసం మనం కోరుకుంటే మనసు హాయిగా ఉంటుంది. ఒకరి ఓటమి కోసం కోరుకుంటే అది కరెక్ట్ కాదు సాక్షి అంటుంది. ఒకరి మంచి కోరుకో.. గెలుస్తావు. ఒకరి చెడు కోరుకుంటే ముగింపు ఇలాగే ఉంటుంది. అయినా ఒకరి ఓటమిని చూస్తే నేను సంతోషించేదాన్ని కాదు. నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు.
మొదటి నుంచి మెండితనంతో ముందుకు వెళ్లావు. అసాధ్యాన్ని సాధించాలని కోరుకున్నావు. ఏదో ఒకసారి విజయం దక్కుతుందేమో. అన్నిసార్లు అది సాధ్యం కాదు సాక్షి. మనిషి గాలివాటం కాదు. వ్యక్తిత్వాన్ని బట్టి నడుచుకోవాలి అంటుంది. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు.
రిషి రాగానే… రిషిని కాదని నువ్వు చాలా మంచి పని చేశావు అంటుంది సాక్షి. నువ్వు అదే మాట మీద ఉండు. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. అసలు రిషికి ప్రేమంటే ఏంటో తెలియదు అని అంటుంది సాక్షి. ఆ తర్వాత సాక్షి, వసుధర వెళ్లిపోతారు.
వాళ్లు వెళ్లిపోగానే.. రిషి దగ్గరికి వచ్చిన మహీంద్రా సంతోషిస్తాడు. ఇంట్లో వాళ్లంతా సంతోషంతో ఎగిరి గంతేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.