Guppedantha Manasu 18 Aug Today Episode : వసుధర, రిషి కలిసిపోయారా? జగతిని అమ్మ అని రిషి పిలుస్తాడా? శుభం కార్డు పడనుందా?

Guppedantha Manasu 18 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 ఆగస్టు 2022, గురువారం ఎపిసోడ్ 532 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగతి, మహీంద్రా, గౌతమ్ ముగ్గురు సెలబ్రేట్ చేసుకోవడం కోసం హోటల్ కు వెళ్తారు. అదే హోటల్ కు వసుధర, రిషి కూడా వస్తారు. వాళ్లను చూసి షాక్ అవుతారు. మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు రిషి. దీంతో కేక్ కోసం అని అంటాడు గౌతమ్. అదేంటి కేకా అంటాడు రిషి. దీంతో మహీంద్రా షాక్ అవుతాడు. దీంతో ఏం చెప్పాలో తెలియక.. కేకే రావు అని నా ఫ్రెండ్ ఉన్నాడు. అతడిని కలుద్దామని వచ్చా అంటాడు మహీంద్రా. మరి మీరు ఎక్కడికి వెళ్లినట్టు అని అడుగుతాడు మహీంద్రా. దీంతో డిస్కషన్స్ అంటాడు రిషి. డిస్కషన్సా ఏం డిస్కషన్స్ అంటాడు మహీంద్రా.

guppedantha manasu 18 august 2022 full episode

ఇంతలో వసుధర నువ్వు వెళ్లి నాకు కాఫీ తీసుకురా అంటాడు రిషి. నీకేనా… మేము కూడా తాగుతాం కాఫీలు అంటాడు గౌతమ్. దీంతో అందరికీ తీసుకురా అంటాడు రిషి. నీ మొహం ఏంట్రా వెలిగిపోతోంది అని అడుగుతాడు రిషి. దీంతో అవును.. వెలిగిపోతోంది.. అంటాడు. సరే.. ముందు కూర్చుందాం అంటాడు. అంకుల్.. ఇద్దరూ కలిసి వచ్చారంటే ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది అని మహీంద్రా, గౌతమ్ ఇద్దరూ గుసగుసలాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటున్నారు డాడ్ అంటాడు రిషి. దీంతో రాబోయే పరీక్షల గురించి డిస్కస్ చేస్తున్నాం. అదే విషయం గురించి నేను గౌతమ్ తో చర్చిస్తున్నాను అంటాడు మహీంద్రా.

ఇంతలో వసుధర కాఫీ తీసుకొస్తుంది. అందరికీ కాఫీ ఇస్తుంది. ఒకే కాఫీని రిషి, వసుధర ఇద్దరూ పంచుకుంటారు. తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. రాత్రి భోజనం చేస్తుండగా దేవయాని మాత్రం భోజనానికి రాదు. దీంతో తనే అన్నం పెట్టుకొని దేవయాని దగ్గరికి వెళ్తాడు.

Guppedantha Manasu 18 Aug Today Episode : దేవయానికి భోజనం తినిపించిన రిషి

తన దగ్గరికి భోజనం తీసుకెళ్లి తనకు తినిపిస్తాడు. మీ ప్రేమలో స్వార్థం లేదు.. అంటాడు రిషి. ఆ సాక్షి నిన్ను అనరాని మాటలు అన్నది అంటుంది దేవయాని. ఇప్పుడు సాక్షి గురించి ఎందుకు చెప్పండి అంటాడు రిషి. నా దగ్గర నటించే వాళ్లంటే నాకు చాలా కోపం పెద్దమ్మ అంటాడు రిషి.

దీంతో తనకు పొర బోతుంది. ఎందుకంటే దేవయాని కూడా నటిస్తుంది కదా. నా విషయంలో నిజం తెలిస్తే రిషి ఏం చేస్తాడో అని బయపడుతుంది దేవయాని. తనకు కూడా అలా రిషి తినిపిస్తే బాగుండు అని అనుకొని ఏడుస్తుంది జగతి. నువ్వు అనుకుంటున్నది ఎప్పుడో ఒకప్పుడు నిజం అవుతుంది జగతి అంటాడు మహీంద్రా.

కట్ చేస్తే వసుధరకు క్యారేజ్ తీసుకొని వస్తాడు ఓ వ్యక్తి. క్యారేజ్ ఇచ్చాక ఈ నెంబర్ కు కాల్ చేయమని చెప్పారు. వస్తాను మేడమ్ అని చెప్పి వెళ్తాడు ఆ వ్యక్తి. దీంతో ఫుడ్ ఎవరు పంపించారు అని అనుకుంటుంది వసుధర. వెంటనే ఆ నెంబర్ కు ఫోన్ చేస్తుంది.

అది ఎవరిదో కాదు రిషి నెంబర్. సర్ క్యారేజ్ ఎందుకు పంపించారు అని అడుగుతుంది. దీంతో తినడానికి పంపించాను అంటాడు రిషి. నువ్వు సరిగ్గా తినకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావని తెలుసు. అందుకే.. నీకు క్యారేజ్ పంపించాను అంటాడు రిషి.

కట్ చేస్తే.. కాఫీ కావాలని ధరణిని అడుగుతాడు. కానీ.. అక్కడ ధరణి ఉండదు. నేను ఇస్తాను సార్ అంటుంది జగతి. దీంతో మీరు నన్ను ఇక నుంచి సార్ అని పిలవాల్సిన అవసరం లేదు. రిషి అని పిలవొచ్చు అని అంటాడు. దీంతో జగతి షాక్ అవుతుంది. ఆనందంతో గంతులేస్తుంది.

తర్వాత కాఫీ ఇస్తుంది రిషికి. దీంతో కాఫీ తీసుకొని తాగుతాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

33 minutes ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

3 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

5 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

7 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

8 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

9 hours ago

Periods | పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయకూడదా.. వైద్య నిపుణులు సూటిగా చెప్పే సత్యం ఇదే..!

Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయరాదు,…

10 hours ago

Weight | బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా చదవాల్సిన వార్త.. అరటిపండు,యాపిల్‌ల‌లో ఏది బెస్ట్‌

Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…

11 hours ago