Guppedantha Manasu 18 Aug Today Episode : వసుధర, రిషి కలిసిపోయారా? జగతిని అమ్మ అని రిషి పిలుస్తాడా? శుభం కార్డు పడనుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 18 Aug Today Episode : వసుధర, రిషి కలిసిపోయారా? జగతిని అమ్మ అని రిషి పిలుస్తాడా? శుభం కార్డు పడనుందా?

Guppedantha Manasu 18 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 ఆగస్టు 2022, గురువారం ఎపిసోడ్ 532 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగతి, మహీంద్రా, గౌతమ్ ముగ్గురు సెలబ్రేట్ చేసుకోవడం కోసం హోటల్ కు వెళ్తారు. అదే హోటల్ కు వసుధర, రిషి కూడా వస్తారు. వాళ్లను చూసి షాక్ అవుతారు. మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు రిషి. దీంతో కేక్ కోసం […]

 Authored By gatla | The Telugu News | Updated on :18 August 2022,10:00 am

Guppedantha Manasu 18 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 ఆగస్టు 2022, గురువారం ఎపిసోడ్ 532 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగతి, మహీంద్రా, గౌతమ్ ముగ్గురు సెలబ్రేట్ చేసుకోవడం కోసం హోటల్ కు వెళ్తారు. అదే హోటల్ కు వసుధర, రిషి కూడా వస్తారు. వాళ్లను చూసి షాక్ అవుతారు. మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు రిషి. దీంతో కేక్ కోసం అని అంటాడు గౌతమ్. అదేంటి కేకా అంటాడు రిషి. దీంతో మహీంద్రా షాక్ అవుతాడు. దీంతో ఏం చెప్పాలో తెలియక.. కేకే రావు అని నా ఫ్రెండ్ ఉన్నాడు. అతడిని కలుద్దామని వచ్చా అంటాడు మహీంద్రా. మరి మీరు ఎక్కడికి వెళ్లినట్టు అని అడుగుతాడు మహీంద్రా. దీంతో డిస్కషన్స్ అంటాడు రిషి. డిస్కషన్సా ఏం డిస్కషన్స్ అంటాడు మహీంద్రా.

guppedantha manasu 18 august 2022 full episode

guppedantha manasu 18 august 2022 full episode

ఇంతలో వసుధర నువ్వు వెళ్లి నాకు కాఫీ తీసుకురా అంటాడు రిషి. నీకేనా… మేము కూడా తాగుతాం కాఫీలు అంటాడు గౌతమ్. దీంతో అందరికీ తీసుకురా అంటాడు రిషి. నీ మొహం ఏంట్రా వెలిగిపోతోంది అని అడుగుతాడు రిషి. దీంతో అవును.. వెలిగిపోతోంది.. అంటాడు. సరే.. ముందు కూర్చుందాం అంటాడు. అంకుల్.. ఇద్దరూ కలిసి వచ్చారంటే ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది అని మహీంద్రా, గౌతమ్ ఇద్దరూ గుసగుసలాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటున్నారు డాడ్ అంటాడు రిషి. దీంతో రాబోయే పరీక్షల గురించి డిస్కస్ చేస్తున్నాం. అదే విషయం గురించి నేను గౌతమ్ తో చర్చిస్తున్నాను అంటాడు మహీంద్రా.

ఇంతలో వసుధర కాఫీ తీసుకొస్తుంది. అందరికీ కాఫీ ఇస్తుంది. ఒకే కాఫీని రిషి, వసుధర ఇద్దరూ పంచుకుంటారు. తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. రాత్రి భోజనం చేస్తుండగా దేవయాని మాత్రం భోజనానికి రాదు. దీంతో తనే అన్నం పెట్టుకొని దేవయాని దగ్గరికి వెళ్తాడు.

Guppedantha Manasu 18 Aug Today Episode : దేవయానికి భోజనం తినిపించిన రిషి

తన దగ్గరికి భోజనం తీసుకెళ్లి తనకు తినిపిస్తాడు. మీ ప్రేమలో స్వార్థం లేదు.. అంటాడు రిషి. ఆ సాక్షి నిన్ను అనరాని మాటలు అన్నది అంటుంది దేవయాని. ఇప్పుడు సాక్షి గురించి ఎందుకు చెప్పండి అంటాడు రిషి. నా దగ్గర నటించే వాళ్లంటే నాకు చాలా కోపం పెద్దమ్మ అంటాడు రిషి.

దీంతో తనకు పొర బోతుంది. ఎందుకంటే దేవయాని కూడా నటిస్తుంది కదా. నా విషయంలో నిజం తెలిస్తే రిషి ఏం చేస్తాడో అని బయపడుతుంది దేవయాని. తనకు కూడా అలా రిషి తినిపిస్తే బాగుండు అని అనుకొని ఏడుస్తుంది జగతి. నువ్వు అనుకుంటున్నది ఎప్పుడో ఒకప్పుడు నిజం అవుతుంది జగతి అంటాడు మహీంద్రా.

కట్ చేస్తే వసుధరకు క్యారేజ్ తీసుకొని వస్తాడు ఓ వ్యక్తి. క్యారేజ్ ఇచ్చాక ఈ నెంబర్ కు కాల్ చేయమని చెప్పారు. వస్తాను మేడమ్ అని చెప్పి వెళ్తాడు ఆ వ్యక్తి. దీంతో ఫుడ్ ఎవరు పంపించారు అని అనుకుంటుంది వసుధర. వెంటనే ఆ నెంబర్ కు ఫోన్ చేస్తుంది.

అది ఎవరిదో కాదు రిషి నెంబర్. సర్ క్యారేజ్ ఎందుకు పంపించారు అని అడుగుతుంది. దీంతో తినడానికి పంపించాను అంటాడు రిషి. నువ్వు సరిగ్గా తినకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావని తెలుసు. అందుకే.. నీకు క్యారేజ్ పంపించాను అంటాడు రిషి.

కట్ చేస్తే.. కాఫీ కావాలని ధరణిని అడుగుతాడు. కానీ.. అక్కడ ధరణి ఉండదు. నేను ఇస్తాను సార్ అంటుంది జగతి. దీంతో మీరు నన్ను ఇక నుంచి సార్ అని పిలవాల్సిన అవసరం లేదు. రిషి అని పిలవొచ్చు అని అంటాడు. దీంతో జగతి షాక్ అవుతుంది. ఆనందంతో గంతులేస్తుంది.

తర్వాత కాఫీ ఇస్తుంది రిషికి. దీంతో కాఫీ తీసుకొని తాగుతాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది