Guppedantha Manasu 21 Nov Today Episode : రిషి, వసుధారను అడ్డంగా బుక్ చేసిన దేవయాని.. కరెక్ట్ టైమ్ కు వచ్చి సేవ్ చేసిన మహీంద్రా.. జగతి షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 21 Nov Today Episode : రిషి, వసుధారను అడ్డంగా బుక్ చేసిన దేవయాని.. కరెక్ట్ టైమ్ కు వచ్చి సేవ్ చేసిన మహీంద్రా.. జగతి షాక్

Guppedantha Manasu 21 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 613 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగతిని చూసిన రిషి పెదనాన్న ఏంటమ్మా ఇది ఎందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఏమైంది.. వసుధార ఎంత విజయం సాధించింది. ఈ టైమ్ లో మహీంద్రా కూడా దగ్గరుండాలి కానీ.. ఇలా చేయడం ఏంటి అని అంటాడు. మరోవైపు వసుధార డోర్ […]

 Authored By gatla | The Telugu News | Updated on :21 November 2022,9:00 am

Guppedantha Manasu 21 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 613 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగతిని చూసిన రిషి పెదనాన్న ఏంటమ్మా ఇది ఎందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఏమైంది.. వసుధార ఎంత విజయం సాధించింది. ఈ టైమ్ లో మహీంద్రా కూడా దగ్గరుండాలి కానీ.. ఇలా చేయడం ఏంటి అని అంటాడు. మరోవైపు వసుధార డోర్ తీద్దామని అనుకునే సరి.. డోర్ ఓపెన్ కాదు. దీంతో ఏం చేయాలో వసుధారకు అర్థం కాదు. వెంటనే రిషికి ఫోన్ చేస్తుంది. బయటి నుంచి గడి పెట్టినట్టున్నారు. ఓపెన్ చేస్తే రావడం లేదు అని చెబుతుంది వసుధార. ఎవరినైనా పంపించండి అంటుంది. దీంతో నేనే వస్తున్నా అంటాడు. ఇంతలో వెళ్లి ఏమైంది అని అడుగుతాడు. దీంతో నేను లోపల ఉండగా బయటి నుంచి గడి పెట్టారు సార్ అంటుంది.

guppedantha manasu 21 november 2022 full episode

guppedantha manasu 21 november 2022 full episode

ఇంతలో ఆ ఆఫీస్ బాయ్ వచ్చి ఇద్దరూ లోపల ఉండగానే మళ్లీ గడి పెట్టి వెళ్లిపోతాడు. బయటి నుంచి ఎవరు గడి పెట్టారని ఆలోచిస్తున్నా అంటుంది. ఇంతలో మళ్లీ డోర్ రాదు. ఏమైంది మళ్లీ డోర్ రావట్లేదు అంటాడు. అసలు ఏం జరుగుతోంది సార్ అంటుంది. మరోవైపు ఆఫీసు బాయ్ వెళ్లి ఓ మీడియా వ్యక్తికి ఏదో చెబుతాడు. దీంతో ఓకే అంటాడు. ఎవరికైనా ఫోన్ చేద్దామా అంటాడు రిషి. దీంతో వద్దు. మనమిద్దరం ఈ రూమ్ లో ఉన్నట్టు బయట తెలిస్తే బాగోదు అంటుంది వసుధార. ఎవరైనా ఉన్నారా అని అంటాడు. ఇంతలో అక్కడ మరో డోర్ ఉంది కదా.. అక్కడ ట్రై చేద్దాం అంటాడు. వేరే డోర్ దగ్గరికి వెళ్లి ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు రిషి. హలో.. హలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఇంతలో వెళ్లి ముందు డోర్ తీసి వెళ్తాడు ఆఫీస్ బాయ్.

ఆ డోర్ కూడా ఓపెన్ అవడం లేదు. ఒకసారి ఈ డోర్ ఓపెన్ చేసి చూద్దాం అని డోర్ ఓపెన్ చేస్తాడు. ఇంతలో డోర్ ఓపెన్ అవుతుంది. చూసేసరికి.. అందరూ అక్కడ నిలబడి ఉంటారు. ఏంటి రిషి సార్ ఇది అని అడుగుతారు మీడియా వాళ్లు.

దీంతో మేము లోపలికి వెళ్లగానే ఎవరో బయటికి నుంచి గడి పెట్టారు అంటాడు. దీంతో మరి మేము వచ్చాక ఎవరు డోర్ తీశారు. మేము వచ్చాక దొరికిపోయాక కవర్ చేసుకుంటున్నారా? అంటాడు. దీంతో అతడి మీద సీరియస్ అవుతాడు రిషి.

మనమందరం చూశాం కదా.. వచ్చే సరికి తలుపులు తీసి ఉన్నాయి కదా. ఏంటి సార్ ఏమంటారు.. అంటాడు ఆ మీడియా వ్యక్తి. ఏంటి రిషి సార్ ఇది.. ఏదైనా స్టోరీ అల్లితే చూసుకొని అల్లాలి అంటాడు.

Guppedantha Manasu 21 Nov Today Episode : డ్రెస్ మీద జ్యూస్ పడటంతో ఈ రూమ్ కు వచ్చానని చెప్పిన వసుధార

ఒక స్టూడెంట్ తో మీరు గదిలో ఉన్నారు మేము వచ్చేసరికి గడియ పెట్టారని.. తాళాలు వేశారని సింపుల్ గా చెప్పేస్తున్నారు. అందరూ అక్కడ ఉన్నారు కదా. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతారు.

దీంతో పర్సనల్ గా ఇంటర్వ్యూ చేస్తున్నాడేమో. ఇంకా అర్థం కాలేదా అని అంటాడు. దీంతో ఏయ్ మర్యాద అంటాడు రిషి. దీంతో అరవడం ఏంటి సార్.. ఇదే నిజం కదా అంటాడు. ఇంతలో గౌతమ్ కు ఇది పెద్దమ్మ వేసిన ప్లాన్ కాదు కదా అని అనుకుంటాడు గౌతమ్.

అసలు మీరిద్దరూ ఈ గదిలోకి ఎందుకు వచ్చారు చెప్పండి అంటాడు. దీంతో నేను చెబుతాను అంటుంది వసుధార. డ్రెస్ మీద జ్యూస్ పడటంతో నేనే ఈ రూమ్ కు క్లీన్ చేయడానికి వచ్చాను. ఇంతలో బయటి నుంచి గడియ పెట్టి ఉంది అంటుంది.

దీంతో రిషి సార్ కు ఫోన్ చేసి పిలిచాను అంటుంది వసుధార. ఇంతలో రిషి సార్ వచ్చాడు. ఇద్దరం లోపల ఉండగానే ఎవరో బయటి నుంచి మళ్లీ గడియ పెట్టారు అంటుంది వసుధార. కానీ.. మీడియా వాళ్లు వినరు.

దానికి రిషినే ఎందుకు పిలిచారు. వేరే వాళ్లను పిలవచ్చు కదా.. చెప్పండి అంటాడు. దీంతో నేను చెప్పొచ్చా అంటాడు ఆ రూమ్ లో నుంచి బయటికి వచ్చిన మహీంద్రా. రిషి నాకోసం వచ్చాడు. రిషిని నేనే రమ్మన్నాను.

ఏంటి అని ఆ మీడియా వ్యక్తికి షాకిస్తాడు మహీంద్రా. గదిలో ఇద్దరు ఉంటే ఏంటి… మీ ఆలోచనలు మారిపోతాయా? గదిలో మేము ముగ్గురం ఉన్నాం అంటాడు. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. వెళ్లండి.. స్టాఫ్, స్టూడెంట్స్ అంటాడు మహీంద్రా.

వెళ్లి ఇంటర్వ్యూకు ఏర్పాట్లు చేయండి అంటాడు. ఆ తర్వాత రిషి.. మహీంద్రాను హత్తుకుంటాడు. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇంటర్వ్యూ మీద ఫోకస్ పెట్టండి అంటాడు మహీంద్రా.

ఆ తర్వాత జగతికి అసలు విషయం చెబుతాడు. వేరే డోర్ తాళం తీసి వచ్చి రిషి, వసుధారను సేవ్ చేశా అని చెబుతాడు. ఇదంతా ఎవరు చేశారో కూడా తెలుసు అంటాడు మహీంద్రా. ఆ తర్వాత ఇంటర్వ్యూ ప్రారంభం అవుతుంది.

తన ఫ్రెండ్ పుష్ప.. వసుధారను అభినందించడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తోంది.. అని పుష్పను జగతి స్టేజ్ మీదికి ఆహ్వానిస్తుంది. ఇప్పుడు డీబీఎస్టీ కాలేజీ ఎండీ గారు వసుధారను సన్మానిస్తారు అంటుంది జగతి.

దీంతో తనకు దండ వేసేందుకు స్టేజీ మీదికి వస్తాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది