Guppedantha Manasu 26 Aug Today Episode : వసు ప్రేమను రిషి ఒప్పుకుంటాడా? తన ఆశయం మాటేంటి? యూనివర్సిటీ టాపర్ ఆశయాన్ని వసుధర వదిలేసుకుంటుందా?

Guppedantha Manasu 26 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 ఆగస్టు 2022, శుక్రవారం ఎపిసోడ్ 539  హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రెండు గుండెలు ఉన్నా ఆ రెండు గుండెల చప్పుడు మాత్రం ఒక్కటే. అదే ప్రేమ అని రిషితో అంటుంది వసుధర. నన్ను క్షమించండి. నా ప్రేమను అంగీకరించండి.. ఐలవ్యూ అని గిఫ్ట్ ను రిషికి ఇవ్వబోతుంది వసుధర. ఈ మాటను తక్కువ పదాల్లో చెప్పడం నాకు నచ్చడం లేదు కానీ.. చెప్పకుండా ఇంకా ఎక్కువ సేపు ఉండలేనేమో. ఈరోజు కాకపోతే ఇంకెప్పుడూ చెప్పలేనేమో. ఈ మాట చెప్పాక నేను మళ్లీ కొత్తగా పుట్టాననిపిస్తోంది. ఐలవ్యూ అని మళ్లీ చెబుతుంది వసు. దీంతో రిషి వెనక్కి తిరుగుతాడు. వసుధర నువ్వు నువ్వేనా అని అడుగుతాడు. దీంతో కాదు సార్ నేను నేను కాదు. వసుధర నుంచి రిషిధరను అయ్యాను అంటుంది వసు. మీరు నా నీడ. నేను మీ నిజం సార్.. అని గిఫ్ట్ ఇస్తుంది. దీంతో ఆ గిఫ్ట్ ను తీసుకోబోతుండగా జారి కిందపడబోతుంది. దీంతో దాన్ని తన చేతులతో అందుకుంటాడు రిషి.

guppedantha manasu 26 august 2022 full episode

ఒకప్పుడు అది మీ హృదయం. ఇప్పుడు అది మన హృదయం అంటుంది వసు. రెండు పేర్లు, రెండు మనసులు ఒక్కటయ్యాయి అంటుంది వసు. దీంతో నాకిచ్చావుగా. భద్రంగా కాపాడే బాధ్యత ఇకపై నాదే అంటాడు రిషి. దీంతో వసు సంతోషిస్తుంది. వర్షం బాగా పెరిగిపోతోంది.. పదా అని తనను తీసుకెళ్తాడు రిషి. మరోవైపు మహీంద్రా, జగతి ఇద్దరూ వసుధర, రిషి గురించే ఆలోచిస్తుంటారు. వసుధర.. రిషితో తన మనసులో మాట చెప్పేటట్టు ఉంది అని అంటాడు మహీంద్రా. అమ్మ వారి దగ్గర తన మాటలు వింటే నాకు అదే అనిపిస్తోంది. ఎగ్జామ్స్ అయిపోతే వాళ్లిద్దరు కలిసి మాట్లాడుకునే అవకాశం ఇక ఉండదు కదా జగతి అంటాడు మహీంద్రా. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు. ఈసారి వసుధర తన మనసులోని మాటను రిషికి చెప్పేస్తుంది. తనకు ఇదే చివరి అవకాశం. రిషికి ఫోన్ చేశా. ఆన్సర్ చేయలేదు అంటాడు మహీంద్రా. కొంపదీసి రాగానే అడుగుతారా ఏంటి అని అంటుంది జగతి. దీంతో తప్పేముంది జగతి.. రాగానే అడుగుతా అంటాడు మహీంద్రా.

మనం ఇంత టెన్షన్ పడుతున్నాం. ఇది టెన్షన్ కాదు. రిషి మీద మనకు ఉన్న ప్రేమ అంటుంది జగతి. మరోవైపు రిషి, వసు ఇద్దరూ చేతిలో చేయి వేసుకొని పక్కనే ఉన్న ఓ ప్లేస్ కు వెళ్తారు. వర్షం పడుతుండటంతో అక్కడ తలదాచుకుంటారు. మీ పక్కనే ఇలాగే ఉండిపోవాలని ఉంది అని మనసులో అనుకుంటుంది వసు.

మీతో కలిసి చేసే ఈ ప్రయాణం నాకు ఆనందాన్ని ఇస్తోంది. ఇక నా ప్రతి అడుగు మీతోనే అని మనసులో అనుకుంటుంది. మన మధ్య మెమోరీస్ తప్ప దాపరికాలు ఉండకూడదు అని నా కోరిక అంటాడు రిషి. ఈ గిఫ్ట్ ఆరోజు నీకిచ్చిన రోజు నిన్ను బెదిరించింది ఎవరు అని అడుగుతాడు రిషి.

దీంతో వసు షాక్ అవుతుంది. తనను సాక్షి బెదిరించిందని ఎలా చెప్పాలో వసుధరకు అర్థం కాదు. మన మధ్య దాపరికాలు ఉండకూడదు అని చెప్పాను కదా అంటాడు రిషి. దీంతో సాక్షి అని చెబుతుంది వసు. ఊహించాను కానీ.. నువ్వూ నేను మనం అయిన ఈరోజుకి మాత్రం సాక్షి ఈ వర్షమే అంటాడు రిషి.

Guppedantha Manasu 26 Aug Today Episode : ఈ వర్షానికి, నాకు ఏదో అనుబంధం ఉంది అని వసుతో అన్న రిషి

వసుధర.. ఈ వర్షానికి నాకు ఏదో అనుబంధం ఉందేమో. ఒక వర్షం నువ్వు దూరం కాలేదంది. ఇంకొక సారి ఇదే వర్షం నువ్వు నన్ను కాదన్నావని చెప్తుంటే వింది. ఈరోజు అదే వర్షం నిన్నూ నన్ను మనం అంటోంది అంటాడు రిషి. మేఘాలు కరిగిపోతాయి. వర్షం ఆగిపోతుంది. కానీ.. మన ఈ ప్రయాణం ఆగిపోకూడదు అంటాడు రిషి.

ఆ ఆకాశంలా మనం ఎప్పటికీ నిలిచిపోవాలి. ఒక్కటిగా ఉండాలి అని చెప్పి రింగ్ తీస్తాడు. ఎప్పటికీ ఆగిపోని ప్రేమధారలా రిషిధరలా నిలిచిపోవాలి అని తన వేలికి ఆ ఉంగరాన్ని తొడగబోతాడు రిషి. కానీ.. ఆగిపోతాడు. వీ అన్న అక్షరానికి ఆర్ కలవాలంటే గీత గీసినంత సులభం మాత్రం కాదు వసుధర అంటాడు రిషి.

మనం అలా నిలిచిపోవాలంటే ఈ ఉంగరాన్ని నీ వేలికి తొడగాలంటే.. ఒకరికి ఒకరంగా మిగలాలంటే ఒక పని చేయాలి అంటాడు రిషి. ఒక  సామ్రాజ్యాన్ని జయించాలంటే యుద్ధాలు జరగాలి. ఒక ప్రేమ గెలవాలంటే మనం ఒక పని చేయాలి అంటాడు రిషి.

ముఖ్యంగా నువ్వు.. ఒక పని చేయాలి అంటాడు. దీంతో ఏం చేయాలి సార్ అంటుంది వసు. త్యాగం చేయాలి అంటాడు రిషి. దీంతో వసు షాక్ అవుతుంది. నీ ప్రేమను త్యాగం చేయాలి అంటాడు రిషి. త్యాగమా అంటుంది. సర్.. మీరు ఏం మాట్లాడుతున్నారు. మీ ప్రేమను దక్కించుకోవడం కోసం నా ప్రేమను త్యాగం చేసి ప్రేమను పోగొట్టుకోవాలా. అంతకన్నా ప్రాణం అడగండి.. ఇచ్చేస్తాను వెంటనే అంటుంది వసు.

దీంతో నీకు తెలుసు.. నాకు మనసొక్కటి.. మాటొక్కటి నచ్చదు. నీ ప్రేమను పోగొట్టుకోమని అనడం లేదు. నీ ఆశయం కోసం కొన్నాళ్లు ఈ ప్రేమకు దూరంగా ఉండమంటున్నా. మరిచిపోయావా నీ ఆశయం. నీ లక్ష్యం.. యూనివర్సిటీ టాపర్. నీ దృష్టి అంతా రాబోయే పరీక్షల మీద ఉండాలి. ప్రేమ మీద కాదు అంటాడు రిషి.

అందుకే.. నీ పరీక్షలు అయ్యేదాకా మనం కలవకూడదు. మాట్లాడుకోకూడదు అంటాడు రిషి. సార్.. ఇది సాధ్యమా. కష్టం మిమ్మల్ని చూడకుండా.. మీతో మాట్లాడుకుండా ఎలా.. కుదరదు సార్. నా వల్ల కాదు అంటుంది వసు. దీంతో కావాలి వసుధర. ఆశయం కోసం నువ్వు కుటుంబాన్ని వదిలేసి పెళ్లి పీటల మీది నుంచి వచ్చావు. మన ప్రేమ నీ ఆశయాన్ని మార్చింది.

అది మన ప్రేమకే అవమానం. ఆలోచించు అంటాడు రిషి. సార్.. ఆ రింగ్ నాది. నా జీవితం. ఆ ఆనందం నాకు కావాలి. యూనివర్సిటీ టాపర్ స్థానం కన్నా.. ఈ రింగ్ మీతో తొడిగించుకోవడం చాలా గొప్ప అంటుంది వసు. నేను ఆ ఆదృష్టాన్ని పోగొట్టుకోలేను. తప్పక మీరు అన్నట్టే చేస్తాను కానీ.. మీరు నాకు ఓ మాటివ్వాలి. ఇది ఎప్పటికీ నాదే కదా అని అడుగుతుంది.

దీంతో ఈ రీషేంద్ర భూషణ్ నీకు మాటిస్తున్నాడు. ఈ పంచభూతాలు, మన మనసులు సాక్ష్యం. ఎప్పటికీ ఇది నీకే. కానీ.. నీ ఆశయం. నీ చదువు. నువ్వు నాకు మాటివ్వు. నేను చెప్పినట్టు నీ దృష్టి అంతా చదువు మీదే పెట్టు అంటాడు రిషి. దీంతో ఉంగరం సాక్షిగా రిషికి మాటిస్తుంది.

నా ఆశయం కోసం మీ మాట వింటాను. మీరు చెప్పినట్టే పరీక్షలు పూర్తయ్యేదాకా ప్రేమ కోసం ఆలోచించను అంటుంది. ప్రామిస్ అంటుంది వసు. ఇంతలో ఆకాశంలో ఉరుములు రావడంతో రిషిని గట్టిగా పట్టుకుంటుంది వసు. నింగి నేల, వాన గాలి నిప్పు.. అన్నీ మనచుట్టే వసుధర.

ఒక్కమాట చెబుతున్న. ఈ రాత్రి సాక్షిగా ఈ క్షణం నుంచి మన ప్రేమకథ మొదలు అంటాడు రిషి. ఇది మమూలు కథ కాదు. ఒకరిని ఒకరు తెలుసుకొని కలుసుకునే సమయం. ఇది శాశ్వతం అంటాడు రిషి. దీంతో రిషిని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటుంది వసు.

తర్వాత ఇద్దరూ కారులో వెళ్తుంటారు. ఒకరి చేతుల్లో మరొకరు చేతులు పెట్టుకొని సంతోషంగా కారులో వెళ్తుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Smartphone : రూ.15 వేల ధరలో బెస్ట్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌… ఇది ట్రై చేయండి..!

Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…

58 minutes ago

Tea BP : బీపీ ఉన్న వారు టీ తాగితే మంచిదేనా…ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి..!

Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…

2 hours ago

Varalakshmi Vratham : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం.. ఏయే నైవేధ్యాలు చేయాల‌ని ఆలోచిస్తున్నారా..?

Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…

3 hours ago

Pragya Jaiswal : బాబోయ్.. సెగ‌లు రేపుతున్న ప్ర‌గ్యా జైస్వాల్.. ఇంత అందమేంటి బాసు..!

Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ‌.. ప్ర‌గ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…

12 hours ago

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

13 hours ago

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

14 hours ago

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

16 hours ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

16 hours ago