Guppedantha Manasu 30 Aug Today Episode : ఎగ్జామ్స్ స్టార్ట్.. రిషి గురించే ఆలోచిస్తూ వసు పరీక్షలు సరిగ్గా రాస్తుందా? యూనివర్సిటీ టాపర్ గా నిలుస్తుందా?

Authored By Varun G | The Telugu News | Updated on: August 30, 2022, 9:45 am

Guppedantha Manasu 30 Aug Today Episode :  గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 ఆగస్టు 2022, మంగళవారం ఎపిసోడ్ 542 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి ఇంటికి వసుధర వచ్చినట్టు ఊహించుకుంటాడు రిషి. మరోవైపు రిషి.. తనకు కాల్ చేయాలా అని అనుకుంటాడు. వసుధర కూడా రిషికి కాల్ చేయాలా అని అనుకుంటుంది. ఇంతలో రిషి వాట్సప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాడు. అందులో జగతి మేడమ్ ను కూడా యాడ్ చేస్తాడు. ఇంతలో రిషికి గుడ్ ఐడియా సార్ అని మెసేజ్ చేస్తుంది వసు. పుష్ప కూడా ఆ గ్రూప్ ను చూస్తుంది. అందరికీ వచ్చే డౌట్స్ ఇందులో అడగొచ్చా సార్ అని మళ్లీ వసు పెడుతుంది. దీంతో ఏ డౌట్స్ ఉన్నా ఎప్పుడైనా అడగొచ్చు. మీ లక్ష్యమే మీకు ముఖ్యం అన మెసేజ్ పెడతాడు రిషి. నాకోసమే ఈ మెసేజ్ రిషి సార్ పంపారు అని అనుకుంటుంది వసు.

guppedantha manasu 30 august 2022 full episode

guppedantha manasu 30 august 2022 full episode

ఈ మెసేజ్ వసుకు మాత్రమే అని అనుకుంటుంది జగతి. ఎవ్వరికీ తెలియకుండా చాటింగ్ చేసుకుంటున్నారా.. బాగుంది అని అనుకుంటుంది జగతి. భోజనం చేశారా.. టైమ్ కు తినండి.. హెల్త్ కాపాడుకోండి అని మెసేజ్ పెడతాడు రిషి. దీంతో ఓకే సార్ అంటుంది వసుధర. మరోవైపు గౌతమ్, మహీంద్రా, జగతి ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి, వసు ఇద్దరూ ఇలా అయితే ఎలా కలుస్తారు అని అంటాడు గౌతమ్. కానీ.. ఏదో జరుగుతోంది… అంటాడు మహీంద్రా. దీంతో మనకు తెలియకుండా పెద్ద కుట్ర నడుస్తోంది అంటాడు గౌతమ్. జగతి ఫోన్ చూస్తుంటే.. ఏదో చెబుతా అని ఇప్పుడు ఫోన్ చూసుకుంటున్నావేంటి అంటాడు మహీంద్రా. దీంతో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పేరుతో గ్రూప్ స్టార్ట్ చేశాడు రిషి. అందులో ఇద్దరూ చాట్ చేసుకుంటున్నారు అని అసలు విషయం చెబుతుంది జగతి.

వాళ్ల చాట్ మొత్తాన్ని చూపిస్తుంది జగతి. మా ఇంట్లో కరెంట్ పోయింది ఫ్రెండ్స్ అని ఇప్పుడే వసు గ్రూప్ లో మెసేజ్ పెట్టింది అని అంటుంది జగతి. దీంతో ఇప్పుడు చూడు.. వెంటనే కారు తీసుకొని రిషి వెళ్లిపోతాడు అంటాడు మహీంద్రా. గౌతమ్ వెళ్లి చూడగానే నిజంగానే రిషి కారులో వెళ్తుంటాడు. దీంతో జగతి షాక్ అవుతుంది.

Guppedantha Manasu 30 Aug Today Episode : కరెంట్ పోయిందని కారులో వచ్చి కారు లైట్స్ పెట్టి చదువుకో అని చెప్పిన రిషి

మరోవైపు కరెంట్ లేదు.. ఎలా చదువుకోవాలి అని టెన్షన్ పడుతుంది వసు. దీంతో వెన్నెల పడుతుందని బయటికి వస్తుంది. చందమామతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రిషి వస్తాడు. కారు లైట్స్ ఆన్ చేసి పెడతాడు. చదువుకో అంటాడు. దీంతో షాక్ అవుతుంది వసు.

నాకోసం వచ్చారా? కరెంట్ పోయిందని గ్రూప్ లో నేను మెసేజ్ పెడితే వచ్చి కారు లైట్స్ పెట్టారా? థాంక్స్ రిషి సార్ అని మనసులో అనుకుంటుంది వసు. తన చదువు పూర్తయ్యాక.. ఒక లెటర్ రాసి టేబుల్ మీద పెట్టి వెళ్లిపోతుంది వసు. కట్ చేస్తే పరీక్షల సమయం వచ్చేస్తుంది.

పరీక్ష మొదటి రోజు స్టార్ట్ అవుతుంది. కాలేజీకి వచ్చిన రిషి.. అందరూ పరీక్షకు బాగా ప్రిపేర్ అయ్యారా అని అడుగుతాడు రిషి. దీంతో ప్రిపేర్ అయ్యాం సార్ అంటారు అందరూ. అందరితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి కేవలం వసుకు అర్థం అయ్యేట్టుగా మాట్లాడుతాడు రిషి.

తర్వాత తన బ్యాగులో పెన్నును పెడతాడు రిషి. ఎగ్జామ్స్ కోసం పెట్టిన గ్రూప్ లో అందరూ యాక్టివ్ గా ఉండండి. ఎగ్జామ్స్ బాగా రాయండి. మంచిగా మార్క్స్ తెచ్చుకోండి అంటాడు. ఆల్ ది బెస్ట్ చెబుతాడు అందరికీ. వసుకు కూడా ఆల్ ది బెస్ట్ చెబుతాడు.

తర్వాత బ్యాగులో రిషి సార్ పెట్టిన పెన్నును చూస్తుంది వసుధర. పెన్నుతో పాటు ఒక చిన్న లెటర్ ను కూడా పెడతాడు రిషి సార్. మనసు మాట్లాడమంటోంది. షరతు వద్దంటోంది. నీ లక్ష్యమే నీ గమ్యం. ఎగ్జామ్స్ బాగా రాయి. ఆల్ ది బెస్ట్ అని కాగితంలో రాసి పెడతాడు రిషి.

థాంక్యూ సార్ అని అంటుంది వసు. మీరు జెంటిల్ మెన్ సార్ అని అనుకుంటుంది వసు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Jabardasth : చంటికి రావాల్సిన ఆఫర్లు భాస్కర్ కొట్టేస్తున్నాడా?.. నూకరాజు షాకింగ్ కౌంటర్!"

  2. "Women on Bikes : మహిళలు బైక్‌పై రెండు కాళ్లు ఒకే వైపు ఎందుకు పెడతారు? దీని వెనుక ఆసక్తికర చరిత్ర!"

  3. "Annadata Sukhibhava PM Kisan : ఏపీ రైతులకు డబుల్ ధమాకా.. అకౌంట్‌లోకి ఒకేసారి రూ.6 వేలు..!"

  4. "Sai Pallavi : కాబోయే భర్తలో ఆ ఒక్క లక్షణం ఉండాల్సిందే.. జీవిత భాగస్వామిపై సాయిపల్లవి ఆసక్తికర కామెంట్స్..!"

  5. "AP Weather Alert : ఏపీకి మరో వాన గండం.. అండమాన్‌లో అల్పపీడనం, భారీ వర్షాలకు ఛాన్స్!"

  6. "Konda Surekha KTR : బిగ్ బ్రేకింగ్‌.. కేటీఆర్‌కు సారీ చెప్పిన కొండా సురేఖ.. తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్!"

  7. "Cyclone Landfall : తుపాను తీరం దాటడం అంటే ఏంటి? భూమిపైకి వచ్చాక ఏం జరుగుతుంది?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp