Intinti Gruhalakshmi 31 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 డిసెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 830 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐసీయూలో నుంచి అంకిత బయటికి వస్తుంది. దీంతో అంకిత ఏం చెబుతుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇంతకు ముందే అన్ని రకాల టెస్టులు జరిగాయి ఆంటి. ఇంకా రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటుంది అంకిత. మరోవైపు తులసికి ఫోన్ చేసి శృతికి ఎలా ఉందో కనుక్కోండి అని అంటుంది అనసూయ. దీంతో పరందామయ్య.. తులసికి ఫోన్ చేస్తాడు. శృతి కిందపడిందా? ఆసుపత్రిలో ఉందా అని అడుగుతాడు. దీంతో అవును మామయ్య. పొరపాటున బెలూన్ మీద కాలు వేసి కిందపడిపోయింది అంటుంది. మీకు ఎవరు చెప్పారు అంటే.. నందు చెప్పాడు. వాళ్లు కూడా అక్కడే ఉన్నారట కదా అంటాడు. దీంతో ఉన్నారు. మీరు భయపడకండి. నేను మళ్లీ ఫోన్ చేస్తాను అంటాడు పరందామయ్య.
ఇంతలో డాక్టర్ వస్తుంది. శృతి మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయి. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అంటుంది డాక్టర్. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. తన ప్రెగ్నెన్సీకి ఎలాంటి నష్టం జరగలేదు అంటుంది డాక్టర్. దేవుడు ఉన్నాడమ్మా అని అంటాడు ప్రేమ్. శృతి ఐసీయూలోని వెళ్లినప్పటి నుంచి ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా గడిచింది అంటుంది తులసి. దేవుడు దయ చూపించాడు కాబట్టి సరిపోయింది. ఫలితం తిరగబడి ఉంటే.. ఈపాటికి మీ తల్లి శవంలా నీ కళ్ల ముందు ఉండేది అంటుంది తులసి. చాన్స్ దొరికింది కదా అని సెంటిమెంట్ డ్రామా ఆడుతోంది అని అనుకుంటుంది లాస్య. అంకిత.. వెళ్లి శృతిని చూడొచ్చు కదా అని అడుగుతాడు నందు. దీంతో చూడొచ్చు అంటుంది అంకిత. ఒక్కనిమిషం నంద గోపాల్ గారు.. ఇంతకుముందు అంతలా రెచ్చిపోయారు కదా. ఇప్పుడు ఏంటి పిల్లిలా పారిపోతున్నారు అని ప్రశ్నిస్తుంది తులసి.
ఇందాకా మమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు కదా. అప్పుడు భయంలో ఉన్నాను.. బాధలో ఉన్నాను కాబట్టి మీరు ఏమన్నా నేను ఊరుకుంటా అనుకున్నారా? కుటుంబం విడిపోకూడదని.. పిల్లలకు నాన్న ప్రేమ దూరం చేయకూడదని పిల్లలను నీ దగ్గర ఉంచా అంటుంది.
కోరి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. వదిలేసి మీ దారి చూసుకున్నారు. దాన్ని వెన్నుపోటు అంటారు. మీకు పైసా సంపాదన లేకపోయినా మీ మొగుడు పెళ్లాలను పోషించాను. అవసరం తీరాక తెప్ప తగలేశారు. అది వెన్నుపోటు అంటే అంటుంది తులసి. మోసం చేసి మీ ఆవిడ ఇల్లు రాయించుకుంది చూడండి అది వెన్నుపోటు అంటే అంటుంది తులసి.
మీ వారసుడి మీద మీకే కాదు.. నాకూ హక్కు ఉంది అంటుంది తులసి. ఏమంటావురా అని ప్రేమ్ తో అంటుంది తులసి. దీంతో ముందు వాడు నీ మనవడు. ఆ తర్వాతే ఆయన మనవడు అంటాడు ప్రేమ్. ఇంకోసారి మా స్నేహ బంధం గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని నందుకు వార్నింగ్ ఇస్తుంది తులసి.
మీ కుటుంబాన్ని ఒక దగ్గర కలిపి ఉంచడానికి మీరు ఎన్ని త్యాగాలు చేస్తున్నారో నాకు తెలుసు. అలాంటి మిమ్మల్ని అలా అనరాని మాటలు అంటుంటే అడ్డుకున్నాను అంతే అంటాడు సామ్రాట్. అమ్మ.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవగానే శృతిని తీసుకొని డైరెక్ట్ గా ఇంటికే వస్తాం అంటాడు ప్రేమ్.
అలా ఎలా కుదురుతుంది అంటే.. మా అమ్మకు గౌరవం లేని చోట మేము కూడా ఉండం అంటాడు ప్రేమ్. ఆ తర్వాత అందరూ వెళ్లి శృతిని చూస్తారు. ఆ తర్వాత సామ్రాట్ కారులో ఇంటికి వెళ్తూ ఉంటుంది తులసి. సామ్రాట్ గారు కొంచెం ఒక సారి కారు పక్కకు ఆపుతారా అంటుంది తులసి.
దీంతో సరే అంటాడు సామ్రాట్. కారు ఆపాక దిగి నీళ్లతో ముఖం కడుక్కుంటుంది తులసి. నందు అన్న మాటలే తనకు గుర్తుకు వస్తాయి. చెప్పాల్సినవన్నీ నందగోపాల్ ముఖం మీదే మొహమాటం లేకుండా చెప్పారు కదా. అనాల్సినవి ఇంకేం లేవు అంటాడు సామ్రాట్.
దీంతో ఆయన్ను అనాలని నాకు ఏమాత్రం లేదు. నన్ను బాధపెట్టేలా ఆయనే మాట్లాడుతున్నారు అంటుంది తులసి. ఏ రోజూ శృతిని ప్రేమగా పలకరించని ఆ పెద్దమనిషికి ఈరోజు వారసుడి కోసం శృతి మీద ప్రేమ పుట్టుకొచ్చిందా అని అంటుంది తులసి.
తండ్రీ కొడుకులను నేను విడదీయాలని అనుకోవడం లేదు అంటుంది తులసి. తర్వాత తులసి కోసం టీ తీసుకొస్తాడు సామ్రాట్. కట్ చేస్తే శృతిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. నువ్వు ఎప్పుడు ఏం చేయాలో, ఏం తినాలో ఆంటి ఈ పేపర్ మీద రాసింది. నువ్వు ఇది ఫాలో అవ్వాల్సిందే అంటుంది అంకిత.
ఆంటీ నీ కోసం గ్లూకోజ్ పౌడర్ కూడా పంపించింది అంటుంది అంకిత. ఆ విషయాలు నీకు తెలియదా అంకిత.. తులసి చెప్పాల్సిన అవసరం ఏంటి అని అంటాడు నందు. మంచి విషయం ఎవరు చెబితే ఏంటి రా అని అంటుంది అనసూయ. దీంతో మనింట్లో తులసి కల్పించుకోవాల్సిన అవసరం లేదు అంటాడు నందు.
అనవసరంగా హైరానా పడకు. ఎవ్వరూ నీ మాట వినరు అంటుంది లాస్య. తులసి ముగ్గురు పిల్లలను కని పెంచింది. తన అనుభవంతో తన కోడలుకు జాగ్రత్తలు చెబుతోంది. అందులో తప్పేంటి అంటుంది అనసూయ. దీంతో మీరు పిల్లలను కనలేదా అంటుంది లాస్య.
ఈరోజు జరిగిన ఇంత గొడవకు తులసే కారణం కదా అంటాడు నందు. దీంతో ఆంటీ పిలవలేదు. మేమే వెళ్లాం అంటుంది శృతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.