Hanuman Movie : హనుమాన్ టైటిల్ పెట్టడానికి కారణం చిరంజీవినే .. అసలేం జరిగిందంటే ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hanuman Movie : హనుమాన్ టైటిల్ పెట్టడానికి కారణం చిరంజీవినే .. అసలేం జరిగిందంటే ..?

 Authored By anusha | The Telugu News | Updated on :8 January 2024,9:20 pm

Hanuman Movie : తేజా సజ్జా హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన హనుమాన్ సినిమా జనవరి 12న విడుదల కాబోతుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకంగా 12 భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాదులో నిర్వహించారు. ఇక సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి తన ప్రసంగంతో సినిమా టీం తో పాటు అభిమానులకు ఉత్సాహం కలిగేలా చేశారు. ఈ సందర్భంగా హను మ్యాన్ అంటూ టైటిల్ లో మధ్యలో డాష్ మార్క్ పెట్టి ప్రత్యేకత కలగజేయడం వెనుక తానున్న కారణాన్ని వివరించారు.

గతంలో ఆహా కోసం సమంత నిర్వహించిన టాక్ షో కి చిరంజీవికి ఎదురైన ప్రశ్న స్పైడర్ మాన్, బ్యాట్ మాన్, సూపర్ మాన్ మీకు ఎవరంటే ఇష్టమని అడగగా దానికి చిరంజీవి ఎవరో ముక్కు మొహం తెలియని హాలీవుడ్ సూపర్ హీరోల గురించి చెప్పడం ఎందుకని తన ఇష్ట దైవం హనుమాన్ పేరుని హనుమ్యాన్ అని పలికి సమాధానం చెప్పారు. ఇదే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ని ఆకట్టుకుంది. ఇలా టైటిల్ లాక్ చేసుకునేందుకు ప్రేరేపించిందట. ఈ రకంగా ప్రభావితం చెందటం తనకే ఎంతో సంతోషం కలిగిందని చిరంజీవి చెప్పారు. అంతేకాదు నిజజీవితంలో ప్రత్యేకంగా గుడులకు పోకపోయినా ఏదైనా సమస్య వచ్చినప్పుడు రాత్రి పడుకునే ముందు ఆంజనేయుడిని తలచుకోవడం వల్ల ఉదయం లేవగానే పరిష్కారం దొరికేదని అంత మహత్తు హనుమంతుడికి ఉందని అన్నారు.

మొత్తానికి చిరంజీవి రావడం వలన హనుమాన్ ఈవెంట్ లో సందడి నెలకొంది. మధ్యలో గొంతు చీరపోయిన ఇబ్బంది పెడుతున్న పేరుపేరునా అందరిని ప్రస్తావించి మెచ్చుకుంటూ సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చిన ఆడతాయని, థియేటర్ల సమస్య వల్ల మొదటి రోజు లేదా ఫస్ట్ షో చూడకపోయినా తర్వాత కంటెంట్ బావుందని తెలిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా వస్తారని చెప్పారు. గతంలో ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ సినిమాలు సంక్రాంతికి విడుదల అవ్వబోయే టైంలో దిల్ రాజు శతమానం భవతి విడుదల చేసి విజయాన్ని దక్కించుకున్నారు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఆడుతుందని దిల్ రాజు చెప్పారు. అలానే హనుమాన్ సినిమా కూడా ఖచ్చితంగా ఆడుతుందని మెగాస్టార్ తెలిపారు.

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది