Hanuman Movie : హనుమాన్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్..!
ప్రధానాంశాలు:
Hanuman Movie : హనుమాన్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్..!
Hanuman Movie : సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళుతూ బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించుకుంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. తాజాగా హైదరాబాదులో నిర్వహించిన సమావేశంలో చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే బుద్ధి, ధైర్యం, బలం, యశస్సు, నిర్భయత్వం ,అరోగత, అజాడ్యం వాక్పటిత్యం ఇవన్నీ ఆంజనేయస్వామిని తలుచుకుంటే ప్రసాదిస్తాడు. అలాంటి ఆంజనేయ స్వామిని తలుచుకునేటట్లు చేసిన హనుమాన్ సినిమా టీం కి కృతజ్ఞతలు తెలపటానికి వచ్చానని అన్నారు. హనుమాన్ సినిమాలో పనిచేసిన వారంతా యంగర్స్ అని, తేజ సజ్జా లాంటి చిన్న పిల్లాడు బ్లాక్ బస్టర్ ఇవ్వడం గ్రేట్ అని అన్నారు.
సుందరకాండలో ఒక ఘట్టంలో ఆంజనేయస్వామి, విభీషణుడు యుద్ధం జరిగిన తర్వాత రాత్రి పూట సంచరిస్తున్నారు. వానరులంతా పడిపోయారు. కొందరు చనిపోయారు. ఒక చోట జాంబవంతుడు నొప్పితో బాధపడుతూ ఉంటాడు. జాంబవంతుడు విభీషణుడిని ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడని అడుగుతాడు. దీంతో విభీషణుడు సుగ్రీవుడు, అంగదుడు, ఇంకా వేరే వాళ్ళ గురించి అడగలేదు కానీ ఆంజనేయ స్వామి గురించి ఎందుకు అడుగుతున్నావని అడిగాడు. అందుకు జాంబవంతుడు ఆంజనేయ స్వామి బ్రతికి ఉంటే మన వానరమంతా బ్రతికి ఉన్నట్లే అని అంటాడు. ఆంజనేయ స్వామి ఒక్కడు పోతే మేమందరం బ్రతికి ఉన్న ప్రయోజనం ఉండదు అని జాంబవంతుడు అంటాడు. అలాంటి హనుమాన్ సినిమా తీసినందుకు ప్రశాంత్ వర్మను అభినందిస్తున్న అని అన్నారు.
మన దేశంలో యువత ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయని అన్నారు. అయితే ఆంజనేయ స్వామి కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని పూజారి రంగరాజన్ తెలిపారు. రామాయణంలో ఆంజనేయ స్వామి సీత దేవి కోసం లంక అంత వెతుకుతాడు .కానీ ఆమె ఎక్కడ కనిపించదు. దీంతో ఆంజనేయ స్వామి నేను ఇంత దూరం ఎగిరి వచ్చి వట్టి చేతులతో వెళితే నాకేమీ ఉంటుందని, సీత కనిపించకపోతే రాముల వారి పరిస్థితి ఏంటని, వానరసైన్యం ఏమవుతుందని, వాళ్లంతా ప్రాణత్యాగం చేస్తారు. అందుకోసం నేను ప్రాణత్యాగం చేసుకుంటా అని ఆంజనేయ స్వామి అనుకుంటాడు. తర్వాత మళ్ళీ ఆలోచనలో పడి నేను ప్రాణత్యాగం చేసుకుంటే రాముల వారి పరిస్థితి ఏమవుతుందని వానర సైన్యం ఏమవుతుందో అని ఆలోచించుకొని సీతమ్మ వారి కోసం వెతకడం ప్రారంభించాడు.