Prashanth Varma : హనుమాన్ సినిమా ముందు పెద్ద పెద్ద డైరెక్టర్లు, హీరోలు పనికిరారు… ప్రశాంత్ వర్మ స్ట్రాంగ్ కౌంటర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prashanth Varma : హనుమాన్ సినిమా ముందు పెద్ద పెద్ద డైరెక్టర్లు, హీరోలు పనికిరారు… ప్రశాంత్ వర్మ స్ట్రాంగ్ కౌంటర్..!

 Authored By jyothi | The Telugu News | Updated on :13 January 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Prashanth Varma : హనుమాన్ సినిమా ముందు పెద్ద పెద్ద డైరెక్టర్లు, హీరోలు పనికిరారు... ప్రశాంత్ వర్మ స్ట్రాంగ్ కౌంటర్..!

Prashanth Varma : చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తేజా సజ్జా ఇప్పుడు హీరోగా మారాడు. కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో హీరోగా తేజా సజ్జా నటించారు. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న హనుమాన్ సినిమా యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హీరో తేజా సజ్జా, హీరోయిన్ అమృత అయ్యర్, ప్రొడ్యూసర్ కె. నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. హనుమాన్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకోలేదని, సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదని, హనుమంతుడే సినిమాని ఇంత పెద్ద హిట్ చేశాడని నమ్ముతున్నాను అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. సంక్రాంతికి ఇంత టఫ్ కాంపిటీషన్లో కూడా హనుమాన్ సినిమా ఇంత సక్సెస్ అవుతుందని అనుకోలేదని అన్నారు. మనకు తెలిసిందే ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు బరిలోకి దిగాయి. ఇక గుంటూరు కారం, హనుమాన్ సినిమా ఒకే రోజు విడుదలయ్యాయి. అంతేకాకుండా గుంటూరు కారం సినిమాకి ఎక్కువ థియేటర్లు దక్కాయి. హనుమాన్ కి చాలా తక్కువ థియేటర్లు దక్కాయి. ఇంత టఫ్ కాంపిటీషన్లో కూడా హనుమాన్ సినిమా గుంటూరు కారం కంటే బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది.

గుంటూరు కారం సినిమా కంటే హనుమాన్ సినిమా బాగుందని ప్రేక్షకులు అంటున్నారు. ఒకపక్క అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్న క్రమంలో హనుమాన్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని హనుమాన్ టీం భావించారు. అయోధ్య రామయ్య జన్మభూమి మందిరం ప్రతిష్టకు ముందే సినిమా ప్రజలకు అందించాలని హనుమాన్ టీం భావించారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి టఫ్ కాంపిటీషన్ ఉన్నా, ఎన్ని అడ్డంకులు వచ్చిన ఎదుర్కొని ఎట్టకేలకు సినిమాను జనవరి 12న విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసి మంచి సక్సెస్ను అందుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ మీట్ లో ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది అనుకోలేదని కామెంట్ చేశారు.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది