prasanth varma : ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమా అధిరా.. హనుమంతుడి కంటే బలమైనోడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

prasanth varma : ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమా అధిరా.. హనుమంతుడి కంటే బలమైనోడు..!

 Authored By aruna | The Telugu News | Updated on :16 January 2024,5:10 pm

Prasanth varma : సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ హనుమాన్ ‘ సినిమా బ్లాక్ బస్టర్ హి ట్ తో దూసుకెళుతోంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. భారతీయ సూపర్ హీరో హనుమంతుడు అని, హనుమంతుడు పవర్స్ సాధించిన తేజ సజ్జాని హను మ్యాన్ గా చూపించారు. అలాగే ప్రశాంత్ వర్మ తర్వాత సినిమా అధిరా ను కూడా హనుమంతుడి లాగా ఒక సూపర్ హీరోని పరిచయం చేయబోతున్నారు. అధిరా సినిమాతో ఒక సూపర్ హీరోని పరిచయం చేయబోతున్నారు. ఇలా మొత్తం 12 మంది సూపర్ హీరోలను ప్రశాంత్ వర్మ పరిచయం చేయనున్నారట.

ప్రపంచంలో ఎవరు ట్రై చేయని సినిమాను ప్రశాంత్ వర్మ పరిచయం చేయబోతున్నారు. ఇక హనుమాన్ కూడా 2025లో విడుదల చేస్తున్నట్లు సినిమా ఎండ్లో చూపించారు. అయితే హనుమాన్ సినిమా కంటే అధిరా క్యారెక్టర్ చాలా బలంగా ఉండబోతుందని ప్రశాంత్ వర్మ చెబుతున్నట్లుగా తెలుస్తుంది. అధిరా అంటే ఒక లైటనింగ్. ఈయనకు దేవుడు ఇంద్రుడు. అతడుకున్న శక్తుల వలన ముట్టుకుంటే షాక్ కొడుతుంది. తనకున్న పవర్స్ ద్వారా పిడుగుల రూపంలో విలన్ లను చంపుతాడు. ఇలా అధిరా పాత్రను ప్రశాంత్ వర్మ చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నాడట. తేజ చేసిన హనుమాన్ క్యారెక్టర్ కంటే అధిరా పాత్ర చాలా బలంగా ఉంటుందని తెలుస్తుంది.

పురాణ ఇతిహాసాల ప్రకారం ఒక్కొక్కరిని సూపర్ హీరో లాగా మలిచి 12 మంది సూపర్ హీరోలను చూపించబోతున్నాడు అని తెలుస్తుంది. అవెంజర్స్ లాగా ఒక శక్తిన ఎదుర్కొన సూపర్ హీరోల లాగా ప్రశాంత్ వర్మ చూపించబోతున్నారని తెలుస్తుంది. దీంతో ఆయనను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. చిన్న సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, పెద్ద సినిమాలకు పోటీగా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లడం ప్రశాంత్ వర్మ ఖాతాలోకి వెళుతుంది. ప్రశాంత్ వర్మ గత సినిమాలు కల్కి జామిరెడ్డి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాయి ఇప్పుడు వచ్చిన హనుమాన్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే ప్రశాంత వర్మ నెక్స్ట్ సినిమాపై ఆసక్తి పెరిగింది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది