Hari Hara Veera Mallu : పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. హరి హర వీరమల్లు స్టోరి లీక్ చేసిన నిధి అగర్వాల్..!
Hari Hara Veera Mallu : జనసేనాని పవన్ కల్యాణ్ మూడేళ్ల సినీ ‘అజ్ఞాతవాసం’ తర్వాత ‘వకీల్ సాబ్’గా టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ పిక్చర్ తర్వాత వరుస సినిమాలకు ఓకే చెప్పిన పవన్.. క్రిష్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’ చేస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా, అందులో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ స్టోరి లీక్ చేసింది. దాంతో పవన్ అశేష అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘హరి హర వీరమల్లు’ పిక్చర్ లో ‘పంచమి’గా నటిస్తున్న నిధి అగర్వాల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ చిత్ర విశేషాలను, స్టోరిని అనుకోకుండా కొంచెం లీక్ చేసింది. ఈ చిత్రం రెండు వేర్వేరు టైమింగ్స్ మధ్య సాగే స్టోరి ఆధారంగా వస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ఇందులో డబుల్ రోల్స్ ప్లే చేయబోతున్నారని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. డబుల్ రోల్స్ తో పవన్ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారని అంటున్నారు.
Hari Hara Veera Mallu : ‘డబుల్’ రోల్స్‌తో ‘డబుల్’ ధమాకా..!
ఈ చిత్ర షూటింగ్ ఈ నెలలో ఓ భాగం చేయాల్సి ఉండగా, కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇకపోతే పవన్ కల్యాన్ టైటిల్ రోల్ ప్లే చేసిన ‘భీమ్లా నాయక్ ’ ఫిల్మ్ ఈ నెల 12న విడుదల కావాల్సి ఉంది. కానీ, విడుదల వాయిదా పడింది. వచ్చే నెల 25న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా, సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించారు.