Bigg Boss Telugu 8 : ఊహించిందే జరిగింది.. బిగ్ బాస్ నుండి ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్..!
Bigg Boss Telugu 8 : బుల్లితెర షో బిగ్ బాస్ కార్యక్రమంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారగా, ఎట్టకేలకి క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో పదో వారం ఊహించని విధంగా రెండు సార్లు ఎలిమినేషన్ జరిగింది. అనారోగ్య కారణాలతో గంగవ్వ హౌజ్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఇక ఎప్పటిలాగా జరిగే వీకెండ్ ఎలిమినేషన్‌లో స్ట్రాంగ్ అండ్ వైల్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన నటి హరితేజ ఎలిమినేట్ అయింది. ఆదివారం షో సందడిగా మారగా, ముందుగా అమ్మాయిలు అబ్బాయిలుగా.. అబ్బాయిలు అమ్మాయిలుగా గెటప్పులు మార్చుకుని కనిపించారు. అందరూ బాగా నవ్వించారు. ముఖ్యంగా అవినాష్ లేడీ గెటప్ లో నవ్వులు పూయించారు.
సండే ఎపిసోడ్ కావడంతో నామినేషన్స్ లో ఉన్న వారు ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కూడా కొనసాగింది. బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం నామినేషన్స్‌లో గౌతమ్, నిఖిల్, ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ ఏడుగురు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో మొదటి నుంచి అత్యధిక ఓట్లతో గౌతమ్ టాప్ ప్లేస్‌లో ఉంటూ వచ్చాడు. ఆ తర్వాతి స్థానంలో నిఖిల్ ఉన్నాడు. అయితే వీకెండ్ వచ్చేసరికి వీరి స్థానాలు కాస్తా అటు ఇటుగా మారాయి.మూడో స్థానంలో ప్రేరణ, నాలుగో స్థానంలో విష్ణుప్రియ, ఐదో స్థానంలో పృథ్వీ నిలిచారు. ఆరు, ఏడు స్థానాలతో డేంజర్ జోన్‌లో వరుసగా యష్మీ, హరితేజ ఉన్నారు. ఎలిమినేషన్ సమయంలో ఒకరికి ఫ్రీ ఎవిక్షన్ షీల్డ్‌ను ఉపయోగిస్తావా అని నబీల్‌ను హోస్ట్ నాగార్జున అడిగారు. కానీ, దానికి నబీల్ నో చెప్పాడు.తన కోసం మాత్రమే ఆ ఎవిక్షన్ షీల్డ్ వాడుకుంటానని చెప్పాడు. దాంతో ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న హరితేజ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున తెలిపారు. మట్కా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చాడు.
Bigg Boss Telugu 8 : ఊహించిందే జరిగింది.. బిగ్ బాస్ నుండి ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్..!
నాగార్జున వరుణ్ తేజ్ ని మట్కా విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ట్రైలర్ కూడా చూశారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ ఇంటి సభ్యులతో సరదాగా ముచ్చటించారు. హౌస్ మేట్స్ చేసిన డ్యాన్స్ ని వరుణ్ ఎంజాయ్ చేశారు. అవినాష్, టేస్టీ తేజ డ్యాన్స్ కి వరుణ్ తేజ్ పడీపడీ నవ్వుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ముసుగు తీసి గేమ్ ఆడాల్సిన వ్యక్తులు ఎవరో ఐదుగురి పేర్లు చెప్పాలి అని అడిగారు. హరితేజ.. అవినాష్, టేస్టీ తేజ, రోహిణి, ప్రేరణ, నిఖిల్ పేర్లు చెప్పింది. అవినాష్ ఎంటర్టైన్ చేస్తాడు కానీ అతడి నిజస్వరూపం తెలియదు. ముసుగు తీయాల్సిన టైం వచ్చింది అని చెప్పింది. రోహిణి కూడా అంతే..ఏదో దాచుకుని గేమ్ ఆడుతోంది. ఇక టేస్టీ తేజ రూల్స్ చెబుతాడు కానీ పాటించడు అని విమర్శించింది. నిఖిల్, ప్రేరణ కూడా కొన్ని ఎమోషన్స్ చూపించాలి కొన్ని కంట్రోల్ చేసుకోవాలి అని హరితేజ సూచించింది.
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్‌డమ్' kingdom movie . గౌతమ్…
Copper Water Bottles : కాపర్ బాటిల్ వాడేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా…
Coolie Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై…
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
This website uses cookies.