Getup Srinu : గెటప్ శ్రీను రీ ఎంట్రీతో ‘జబర్దస్త్’ రేటింగ్ ఏమైనా మారిందా?
Getup Srinu : ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమం ప్రసారం అవ్వబట్టి దాదాపుగా పది సంవత్సరాలు కాబోతుంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన కొత్తలో దేశంలోనే అత్యధిక రేటింగ్ దక్కించుకున్న కామెడీ షో గా రికార్డు సాధించిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో హిందీ ఫిలిం మేకర్స్ మరియు హిందీ సీరియల్ మేకర్స్ కూడా జబర్దస్త్ రేటింగ్ చూసి నోరు వెళ్ళబెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది, ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు యూట్యూబ్ లో జబర్దస్త్ ను చూస్తూ ఉండడం కారణంగా ఈటీవీలో రేటింగ్ తక్కువగా వస్తుంది. అయినా కూడా మల్లెమాల మరియు ఈటీవీ వారు తగ్గకుండా జబర్దస్త్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
జబర్దస్త్ కార్యక్రమంలో ముఖ్యులుగా ఉండే హైపర్ ఆది మరియు సుడిగాలి సుదీర్ లు వెళ్లి పోవడంతో షో యొక్క రేటింగ్ పడిపోతుందని అంతా భావించారు. వారి వెళ్లి పోయిన తర్వాత నిజంగానే రేటింగ్ పడిపోయింది. అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ రేటింగ్ మళ్లీ కాస్త పుంజుకుంది, అందుకు కారణం గెటప్ శ్రీను రావడమే. రాంప్రసాద్ టీం లీడర్ గా వ్యవహరిస్తున్న టీమ్ లోనే గెటప్ శ్రీను రీఎంట్రీ ఇచ్చాడు. సుడిగాలి సుదీర్ లేకపోయినా వారిద్దరు పండిస్తున్న కామెడీతో ప్రేక్షకులు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందుకుంటున్నారు.

Has the rating of Jabardasth changed with the re entry of Getup Srinu
తద్వారా రేటింగ్ విషయంలో మళ్లీ పాత రోజులు వచ్చాయంటూ షో నిర్వాహకులు మరియు జబర్దస్త్ కమెడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక షో పూర్తిగా గెటప్ శ్రీను వైపు మళ్ళింది అనడంలో సందేహం లేదు. మొన్నటికి మొన్న లోకులు కాకులు ఆంటీ గెటప్ లో వచ్చి ఏ స్థాయిలో కామెడీని గెటప్ శ్రీను పండించాడో అందరం చూశాము. ఆయన ఉంటే జబర్దస్త్ మొత్తం కూడా ఒక సందడి అనడంలో సందేహం లేదు. ఆయన లేని రోజుల్లో రేటింగ్ తగ్గింది కానీ ఇప్పుడు ఆయన రీ ఎంట్రీతో రేటింగ్ మళ్లీ పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గెటప్ శ్రీను అందుకే బుల్లి తెర కమల్ హాసన్ అనే పేరును దక్కించుకున్నాడు. ఆ పేరుకు నిజంగానే గెటప్ శ్రీను అర్హుడు అంటూ ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.