Trivikram : త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం మహేష్ బాబు కెరీర్ లో 27వ సినిమాగా సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతోంది. పరశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తైన ఈ సినిమా ఇటీవల హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ మొదలై కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. కాగా త్వరలో మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్‌గా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా తాజాగా మహేష్ 28 ప్రకటన వచ్చింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వాస్తవాలను నిజం చేస్తూ మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ నెక్స్ట్ సినిమా ఉంటుందని అధికారకంగా ప్రకటించారు.
ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. కరోనా ప్రభావం తగ్గగానే సర్కారు వారి పాట సినిమాతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభిస్తారని సమాచారం. కాగా 2022 సమ్మర్ లో విడుదల చేస్తామని తాజాగా వచ్చిన ప్రకటనలో అధికారకంగా వెల్లడించారు. ఇక త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.