Trivikram : త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Trivikram : త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది..!

Trivikram : త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం మహేష్ బాబు కెరీర్ లో 27వ సినిమాగా సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతోంది. పరశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో […]

 Authored By govind | The Telugu News | Updated on :1 May 2021,9:15 pm

Trivikram : త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం మహేష్ బాబు కెరీర్ లో 27వ సినిమాగా సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతోంది. పరశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

hatric movie update by trivikram mahesh combination

hatric movie update by trivikram-mahesh combination

ఇప్పటికే దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తైన ఈ సినిమా ఇటీవల హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ మొదలై కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. కాగా త్వరలో మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్‌గా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా తాజాగా మహేష్ 28 ప్రకటన వచ్చింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వాస్తవాలను నిజం చేస్తూ మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ నెక్స్ట్ సినిమా ఉంటుందని అధికారకంగా ప్రకటించారు.

Trivikram : త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ మూవీ 2022 సమ్మర్ లో విడుదల..!

 

ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. కరోనా ప్రభావం తగ్గగానే సర్కారు వారి పాట సినిమాతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభిస్తారని సమాచారం. కాగా 2022 సమ్మర్ లో విడుదల చేస్తామని తాజాగా వచ్చిన ప్రకటనలో అధికారకంగా వెల్లడించారు. ఇక త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది