Sravana Bhargavi : డైవ‌ర్స్ రూమ‌ర్స్‌పై ఎట్ట‌కేల‌కు స్పందించిన శ్రావ‌ణ భార్గ‌వి, హేమ చంద్ర‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sravana Bhargavi : డైవ‌ర్స్ రూమ‌ర్స్‌పై ఎట్ట‌కేల‌కు స్పందించిన శ్రావ‌ణ భార్గ‌వి, హేమ చంద్ర‌

 Authored By sandeep | The Telugu News | Updated on :29 June 2022,4:02 pm

Sravana Bhargavi : సోష‌ల్ మీడియాలో వ‌చ్చే రూమ‌ర్స్‌కి సంబంధించి అడ్డు , అదుపు అనేది ఉండ‌దు. సినీ సెల‌బ్రిటీల‌కు సంబంధించి లెక్క‌లేనన్ని రూమ‌ర్స్ వ‌స్తుంటాయి. గత ఏడాది టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కపుల్ సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్న విషయాన్నీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అంతకు ముందు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ , కిరణ్ రావు కూడా ఇలాగే విడాకులు తీసుకున్నారు. ఇక కొద్ది రోజులుగా పాపులర్ సింగర్స్..

హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఈ విష‌యంపై ఫ్యాన్స్, నెటిజన్స్ ఈ విషయమై ప్రశ్నిస్తున్నారు. హేమచంద్ర సింగర్‌గా ..డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అందరికీ సుపరిచితుడే. అలాగే, శ్రావణ భార్గవి పలు సూపర్ హిట్స్ సాంగ్స్ పాడింది. వీరిద్ద‌రి విడాకుల విష‌యం నిజ‌మే అని గట్టిగా ప్రచారం జరుగుతుంది. శ్రావణి భార్గవి తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింట్లో కామెంట్స్ సెక్షన్‌ను బ్లాక్ చేసింది. పర్సనల్ లైఫ్‌కు సంబంధించి వస్తున్న వార్తలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె రియాక్ట్ కావాలనుకోవటం లేదంటే.. ఏదో జరిగిందనే నెటిజన్స్ భావిస్తున్నారు.

HEMA CHANDRA Sravana Bhargavi GIVES CLARITY ON DIVORCE RUMORS

HEMA CHANDRA Sravana Bhargavi GIVES CLARITY ON DIVORCE RUMORS

Sravana Bhargavi : అస‌లు క్లారిటీ ఇదే..

ఈ క్ర‌మంలో తమ‌పై వ‌స్తున్న రూమ‌ర్స్‌పై ఇద్ద‌రు ఇన్‌డైరెక్ట్‌గా స్పందించారు. కొద్ది రోజుల నుండి త‌న యూట్యూబ్ వ్యూయ‌ర్స్ పెరిగారు, ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్ పెరిగారు. మీడియా క‌థ‌నాల వ‌ల‌న త‌మ‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతున్న నేప‌థ్యంలో సైలెంట్గా ఉన్నామ‌ని శ్రావ‌ణ భార్గ‌వి ఓ పోస్ట్ పెట్టింది. ఇక హేమ‌చంద్ర కూడా ఓ పోస్ట్ పెట్టాడు. త‌ను పాడిన పాట‌ల కంటే రూమ‌ర్స్ ఎక్కువ స్పీడ్‌గా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే వాటిలో నిజం లేద‌ని శ్రావ‌ణ భార్గ‌విని ట్యాగ్ చేశాడు. ఈ ఇద్ద‌రు చేసిన పోస్ట్‌ల బ‌ట్టి చూస్తుంట త‌మ‌పై వ‌చ్చినవ‌న్నీ రూమ‌ర్స్ అనే అభిప్రాయం జ‌నాల‌లో క‌లుగుతుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది