Sravana Bhargavi : పాపం శ్రావణ భార్గవి.. దిగి రాక తప్పలేదుగా..!
Sravana Bhargavi : శ్రావణ భార్గవి.. ఇటీవల ఈ సింగర్ పేరు తెగ వైరల్ అయింది. కొద్ది రోజుల క్రితం విడాకుల విషయంలో శ్రావణ భార్గవి పేరు హాట్ టాపిక్‌గా మారగా, ఇప్పుడు ఆమె పాడిన పాట విషయంలో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులతో పాటు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. కరాటే కళ్యాణి కూడా ఈ సాంగ్‌పై స్పందించింది. స్వామి సేవలో పాడే కీర్తనకు ఓ ఔన్నత్యం ఉంటుంది. దాని విలువను మనం కాపాడాలే తప్ప కాళ్లు రెండు పైకెత్తి ఊపుతూ చేయడమేంటి? నువ్వు పెళ్లైన అమ్మాయివి. కాళ్లకు మెట్టెలు లేవు, నుదుటన బొట్టు లేదు, మెడలో మంగళసూత్రం లేదు.. శాస్త్రబద్దంగా ఉన్నప్పుడు అవెందుకు పాటించలేదు.
Sravana Bhargavi : తగ్గక తప్పలేదుగా..
భార్గవి పాట నాకు అభ్యంతరకరంగా ఉంది. ఆ పాటలో కొన్ని క్లిప్పులు తొలగించేలా చిన్న చిన్న ఎడిటింగ్ చేయాల్సిందే!’ అని కరాఖండిగా తేల్చి చెప్పింది కల్యాణి. ఎవరెన్ని మాట్లాడినా కూడా .. ఆమె వెనక్కు తగ్గలేదు.. తన పాటలో అసభ్యత ఏముందని తిరిగి ప్రశ్నించింది. అయితే ఆ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. అన్నమయ్య కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికి కూడా సిద్ధమయ్యారు. ఇక శ్రీవారి భక్తులు.. తిరుమల వాసులు సైతం శ్రావణ భార్గవి వార్నింగ్ ఇచ్చారు. ఆమెను తిరుమలలో అడుగుపెట్టనీయం అంటూ హెచ్చరించారు.
శ్రావణ భార్గవి తీరుపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలువురు నిరసనలు కూడా తెలిపారు. దీంతో చేసేదిలేక శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానెల్ నుంచి ‘ఒకపరి కొకపరి వయ్యారమై’ వీడియోను డిలీట్ చేసింది. శ్రావణ భార్గవి ఓ మెట్టు దిగి ఆ వీడియోను తొలగించడంతో తిరుపతి వాసులు, అన్నమయ్య వంశస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శ్రావణ భార్గవి ఈ వివాదానికి ఇలా పులిస్టాప్ పెట్టినట్టు తెలుస్తుంది.