Sravana Bhargavi : ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ శ్రావణ భార్గ‌వి ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sravana Bhargavi : ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ శ్రావణ భార్గ‌వి ఫైర్

 Authored By prabhas | The Telugu News | Updated on :22 July 2022,6:00 pm

Sravana Bhargavi : శ్రావ‌ణ భార్గ‌వి.. ఈ అమ్మ‌డు కోకిల లాంటి గొంతుతో ఎన్నో అద్భుత‌మైన పాట‌లు పాడింది. చిన్న హీరోల‌తో పాటు స్టార్ హీరోల‌కి సైతం పాట‌లు పాడింది. శ్రావణ భార్గవి తెలుగులో స్టార్‌ సింగర్స్ లో ఒకరిగా రాణిస్తున్నారు. మేల్‌ సింగర్‌ హేమచంద్ర , శ్రావణ భార్గవి భార్యాభర్తలనే విషయం తెలిసిందే. ఈ మధ్య వీరిద్దరు విడిపోతున్నట్టు వార్తల్లో నిలిచారు. ఆ వెంటనే అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రావణ భార్గవి మరో పెద్ద వివాదంలో ఇరుక్కుంది. అన్నమయ్య కీర్తనలను ఉపయోగించి ఆమె వీడియో చేయడం దుమారం రేపుతుంది.

వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి అపహాస్యం చేసిందని.. అన్నమయ్య కీర్తనను తన అందాన్ని వర్ణించడానికి ఉపయోగించుకోవాడాన్ని తప్పుపడుతున్నారు. ఆ వీడియోలో శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపించి.. కాళ్లు ఊపుతూ.. పడుకుని కీర్తన పాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. గత నాలుగు రోజులుగా నెట్టింట ఇది వైరల్‌గా మారింది. తిరుపతికి చెందిన అన్నమయ్య ట్రస్ట్ సభ్యలు, అన్నమాచార్యుల వంశీయులు.

Sravana Bhargavi reacts on comments about her

Sravana Bhargavi reacts on comments about her

ఇది స్వామివారిని కించపరిచేలా ఉందని, విజువల్‌ శృంగార భరితంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అన్నమయ్య కీర్తనలను అపహాస్యం చేసేలా ఉన్నాయని, స్వామి వారికి, అమ్మవారిని కీర్తిస్తూ పాడే ఈ పాటని తప్పుగా వాడుతున్నారని, ఇది సరైనది కాదని వారు ఆరోపిస్తున్నారు. ఆ వీడియోని తొలగించాలన్నారు. లేకపోతే టీటీడీకి ఫిర్యాదా చేస్తామన్నారు. కోర్ట్ వరకు వెళ్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో శ్రావ‌ణ భార్గ‌వి స్పందించింది. ఆ వీడియోలో ఆశ్లీలత ఏం ఉంది.. నేను ఎంత భక్తితో పాడానో ఆ పాట నాకు తెలుసు. ఎందుకు డిలీట్ చేయాలని అంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. మీకు ఆ వీడియోలో ఏం కనిపించింది. నేనేం లిరిక్ మార్చి పాడలేదు. సంగీతంలో నాకు ఎంత నాలెడ్జ్ ఉందో అది మొత్తం పెట్టి పాడాను.

నేను పడుకుని చేయడంలో తప్పేం ఉంది. కనీసం ఆ వీడియో లింప్ సింక్ కూడా లేదు. మీ చూపులో తప్పులేకపోతే మీకు అది తప్పుగా అనిపించదు. నా అంతరాత్మకి తెలుసు. నేను తప్పుచేయలేదని.. దాన్ని మీరు తప్పంటున్నారు కాబట్టి.. మీరు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోండి. యూట్యూబ్ వాళ్లతో మాట్లాడుకుని మీరు ఏం చేస్తారో చేసుకోండి.నా మనసుకి అందులో తప్పు కనిపించడం లేదు.. ఇది నేను దైవం సాక్షిగా చెప్తున్నా. నేను కూడా బ్రాహ్మిణే.. నేనూ పూజలు చేస్తా.. వ్రతాలు చేస్తా.. నోములు చేస్తా.. ఈ పాట దేని గురించి. అమ్మవారి గురించి. మీ ఇంట్లో అమ్మాయి పుడితే అమ్మవారిగానే భావిస్తాం కదా.. ఇప్పుడు నేను అదే కదా.. స్త్రీ అంటే అమ్మవారే కదా. స్త్రీని తప్పుగా చూపించలేదు. నేను కాళ్లు ఊపుతూ చేశానని అంటున్నారు.. ఒక అమ్మాయి తన ఇంట్లో తనకి నచ్చినట్టుగా ఉంది.. తెలుగు అమ్మాయి ఎలా ఉంటుందో అలా చూపించాం..

Sravana Bhargavi reacts on comments about her

Sravana Bhargavi reacts on comments about her

తినే వంటకాల దగ్గర నుంచి పుస్తకం వరకూ అన్నీ తెలుగు సాంప్రదాయమే కనిపిస్తుంది. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్ప.. ఇంకేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం. నాది కాదు ప్రాబ్లం. నిజంగా ఈ పాట తప్పు అంటే.. దేవుడే ఆ పాటని తీయించేస్తాడు.మీరు తీయమంటే తీయడానికి మీరు దేవుడు కాదు కదా.. దేవుడికి నచ్చలేదంటే.. ఆ వీడియో అసలు బయటకే రాదు.. నా నమ్మకం ఇది. నాకు తప్పని అనిపించడం లేదు.. మీకు తప్పని అనిపిస్తుంది కాబట్టి.. మీరు ఏం చేస్తారో చేసుకోండి. అందులో తప్పు ఉంటే యూట్యూబ్ వాడే తీసేస్తాడు.

మీ చూపులో తేడా ఉంది కాబట్టి.. తప్పుగా అనిపిస్తుంది. మీరు ఆ వీడియోను చూస్తే అమ్మవారే కనిపించాలి.. కానీ మీ చూపులో తప్పు ఉంది కాబట్టి తప్పుగా కనిపిస్తుంది. మొత్తం దుప్పటి కప్పుకున్న అమ్మాయి కూడా మీకు అశ్లీలంగా కనిపిస్తుంది.. మీ చూపు బాలేకపోతే. మీ చూపులో లోపం ఉంది.. నా పాటలో కాదు’ అంటూ తన వాదనను వినిపించింది శ్రావణ భార్గవి

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది