Sravana Bhargavi : మళ్లీ వార్తలలోకి శ్రావణ భార్గవి.. ఏం చేసిందంటారు..!
Sravana Bhargavi : శ్రావణ భార్గవి.. ఈ అమ్మడు సింగర్‌గా చాలా సుపరిచితం. ఇటీవల ఈ అమ్మడు వివాదాలతో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. కొద్ది రోజుల క్రితం తన విడాకుల వ్యవహారంతో వార్తలలోకి ఎక్కింది. గత కొన్ని రోజుల నుంచి వీరు విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో వార్తలు ప్రసారం అయ్యాయి. దాంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఈ విషయమై ప్రశ్నిస్తున్నారు. కానీ, ఇద్దరు కూడా దీనిపై స్పందించ లేదు. దాంతో ఇది నిజమే అని గట్టిగా ప్రచారం జరుగుతుంది. శ్రావణి భార్గవి తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింట్లో కామెంట్స్ సెక్షన్‌ను బ్లాక్ చేసింది. పర్సనల్ లైఫ్‌కు సంబంధించి వస్తున్న వార్తలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె రియాక్ట్ కావాలనుకోవటం లేదంటే.. ఏదో జరిగిందనే నెటిజన్స్ భావిస్తున్నారు.
Sravana Bhargavi : రీఎంట్రీ..
ఇక ఒకపరి.. కీర్తనతో వివాదానికి తెరలేపిన సింగర్ శ్రావణ భార్గవి.. మెట్టు దిగొచ్చింది. తన వీడియో నుంచి ఆ అన్నమయ్య కీర్తనను తీసేశారు. ఆ స్థానంలో మరో మ్యూజిక్ తో వీడియోను అలాగే ఉంచారు. అయితే ఇదంగా బాగానే ఉంది కాని.. తన వీడియోను ఇంతకాలం వివాదస్పదం చేసిన వారికి మాత్రం గట్టిగా తన గళం వినిపించిందీ స్టార్ సింగర్. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ తన గాత్రాన్ని వినిపించనుంది శ్రావణ భార్గవి. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లైగర్’.
ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో రొమాంటిక్ పాటగా వచ్చిన ‘ఆఫత్’ సాంగ్ తెలుగు వెర్షన్‌ను శ్రావణ భార్గవి ఆలపించింది. మంగళవారం (ఆగస్టు 16)న పుట్టిన రోజు జరుపుకుంటున్న శ్రావణ భార్గవి చివరిగా 2018లో వచ్చిన ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంలో సింగర్‌గా ఆకట్టుకుంది. మరి సినిమాలో ఆ పాట ఎలా ఉంటుంది. ఈ పాటతో శ్రావణ భార్గవి తిరిగి తన పూర్వ వైభవాన్ని అందుకుంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ సాంగ్‌పై కొందరు నెటిజన్స్ ఆసక్తికర చర్చలు జరుపుతున్నారు.