Jabardasth Comedians : జబర్దస్త్ కమెడియన్ ల రియల్ లైఫ్ భార్యలు వీరే .. 18 ఫోటోలు మీకోసం !
Jabardasth Comedians : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ గురించి తెలియని వారు ఉండరు. ఈ షో మొదలై ఎన్నో ఏళ్ళు అవుతున్నా ఇప్పటికి ప్రేక్షకులు దీనిని ఆదరిస్తూనే ఉన్నారు. కామెడీ షో గా బుల్లితెరపై మొదలైన ఈ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. ఇంకా నవ్విస్తూనే ఉంది. ఒకప్పుడు ఈ షోలో నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించారు. వీరిద్దరూ వెళ్లిపోయాక చాలామంది జడ్జిలుగా వచ్చారు వెళ్లిపోయారు. ప్రస్తుతం కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ లో ఒకప్పుడు ఉన్న కామెడీ ఇప్పుడు లేదు అని అంటున్నారు.
ఏళ్ల తరబడి కామెడీ చేస్తున్న కమెడియన్స్ కి జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతోమంది వెండితెరకు కూడా పరిచయమయ్యారు. ఈమధ్య చాలా సినిమాలలో జబర్దస్త్ కమెడియన్స్ కనిపిస్తూనే ఉన్నారు. దీని ద్వారా తెలుస్తుంది జబర్దస్త్ షో ద్వారా వీళ్లకు ఎంత క్రేజ్ వచ్చిందో. మొదట్లో ఉన్న జబర్దస్త్ కమెడియన్స్ ఇప్పుడున్న జబర్దస్త్ లో లేరు. అందరూ సినిమాలలో నటిస్తూ తమ క్రేజ్ ను పెంచుకుంటున్నారు. ఈ షో తర్వాత బుల్లితెరపై చాలా షోలు కామెడీని పంచడానికి వచ్చాయి కానీ జబర్దస్త్ హిట్ అయినంతగా ఏ షో హిట్ కాలేదు.
అయితే తాజాగా జబర్దస్త్ కమెడియన్స్ వారి రియల్ లైఫ్ భార్యలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ ని ఏలేసిన 18 మంది కమెడియన్స్ వారి భార్యలతో ఉన్న ఫోటోలు నెట్ ఇంట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. అందులో గెటప్ శ్రీను, రాంప్రసాద్, రచ్చ రవి, సత్తిపండు, షకలక శంకర్, ధనరాజ్, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, అప్పారావు, సుధాకర్, వెంకీ, ప్రసాద్, దొరబాబు, తాగుబోతు రమేష్ , మహేష్, షేకింగ్ శేషు, వేణు, రాజమౌళి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.