Shimbu : హీరో శింబు మాయలో పడిన మరో కోలీవుడ్ స్టార్ హీరోయిన్..!

Authored By mallesh | The Telugu News | Updated on: October 18, 2022, 2:33 pm

Shimbu : తమిళ్ స్టార్ హీరో శింబు మరోసారి ఫ్రెష్‌గా లవ్ ట్రాక్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. శింబు గతంలో యువ హీరోగా ఎంతో మంది హీరోయిన్ల మనసులు దోచుకున్నాడు. అప్పట్లో మనోడు నటించిన సినిమాలు కూడా పెద్ద హిట్ అయ్యాయి.దీంతో శింబు తన క్రేజ్‌తో ఎంతోమంది హీరోయిన్లను బుట్టులో వేసుకున్నాడు.కొందరితో డేటింగ్ కూడా చేశాడు. ఇలా ఒకరి తర్వాత మరొకరని మార్చిన ఘనత శింబుకే దక్కుతుంది. హీరో శింబుకు కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ ఉంది. మొన్నటివరకు వరుస ప్లాపులతో సతమతమైన శింబు..

ప్రస్తుతం మళ్లీ హిట్ ట్రాక్ బాట పట్టాడు. రీసెంట్‌గా శింబు నటించిన మూవీస్ అన్ని మంచి టాక్‌ తెచ్చుకున్నాయి. దీంతో మరోసారి తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను శింబు బయటకు తీయాలని భావించినట్టు తెలుస్తోంది. గతంలో ప్రేమ పేరుతో శింబు పలువురిని వాడుకుని వదిలేసిన విషయం అందరికీ తెలిసిందే. కోలీవుడ్‌లో ప్రస్తుతం హిట్స్‌తో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్‌ను శింబు లవ్ ట్రాక్‌లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.గతంలో త్రిష, నయనతార, హన్సిక వంటి హీరోయిన్లతో రొమాన్స్ చేసిన శింబు.. ఈసారి ఫ్రెష్ హీరోయిన్ పై మనసు పడ్డట్టు తెలుస్తోంది.

Hero Shimbu is another Kollywood star heroine love

Hero Shimbu is another Kollywood star heroine love

Shimbu : కొత్త హీరోయిన్ బలి కావాల్సిందేనా..

ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు కీర్తి సురేశ్ అని తెలుస్తోంది. శింబు, కీర్తి సురేశ్ కలిసి ప్రస్తుతం కొత్త ప్రాజెక్టు చేస్తున్నారు.. వీరిద్దరూ చాలా క్లోజ్‌గా దిగిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.దీంతో శింబు కీర్తిని లవ్ ట్రాక్‌లో పెట్టినట్టు కథనాలు వస్తున్నాయి.వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమూ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని.. త్వరలోనే విడుదల కానుందని సమాచారం. ఈ నేపథ్యంలో శింబు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఓ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశాడని టాక్. తన బర్త్ డే సందర్భంగా కీర్తికి సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp