Nayanthara : మాజీ లవర్స్ శింబు, ప్రభుదేవా లతో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో చెప్పిన నయనతార…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nayanthara : మాజీ లవర్స్ శింబు, ప్రభుదేవా లతో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో చెప్పిన నయనతార…!

 Authored By aruna | The Telugu News | Updated on :18 November 2023,9:30 pm

ప్రధానాంశాలు:

  •  Nayanthara : మాజీ లవర్స్ శింబు, ప్రభుదేవా లతో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో చెప్పిన నయనతార...!

Nayanthara : సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా నయనతార కొనసాగుతున్నారు. ఈరోజు అనగా నవంబర్ 18న ఆమె పుట్టినరోజు. ఈరోజు 39వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నయనతారకి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విషెస్ తెలియజేస్తున్నారు. ఇక నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకి పది లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఈమెదే టాప్ రెమ్యూనరేషన్. రెండు దశాబ్దాలుగా పరిశ్రమను ఏలేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు.

ఇటీవల బాలీవుడ్ లో ‘ జవాన్ ‘ సినిమాతో హీరోయిన్గా అడుగు పెట్టారు. ఆ సినిమా కూడా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కెరియర్ లో సూపర్ సక్సెస్ అయిన నయనతార వ్యక్తిగతంగా చాలా వివాదాలు ఉన్నాయి. నటుడు శింభూతో ప్రేమలో పడ్డారు. ఇద్దరు కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలు కూడా హల్చల్ చేశాయి. వీరిద్దరు వివాహం చేసుకుంటారని ప్రచారం జరిగింది. ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నయనతార ప్రభుదేవా కి దగ్గర అయింది. పెళ్లై, పిల్లలు ఉన్న ప్రభుదేవతో నయనతార ప్రేమలో పడ్డారు. ప్రభుదేవా భార్య రామలత నయనతార మీద కేసు కూడా పెట్టారు.

రామలతకు ప్రభుదేవా విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుదేవా, నయనతార పెళ్లికి సిద్ధమయ్యారు. త్వరలో పెళ్లి అనగా బ్రేకప్ చేసుకున్నారు. అయితే వీరిద్దరితో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో నయనతార వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ నమ్మకం లేని చోట ప్రేమకు తావు లేదు. ఆ ఇద్దరికీ నాకు మధ్య అపార్ధాలు, మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. దానివలన ఒకరిపై మరొకరికి నమ్మకం పోయింది. అలాంటప్పుడు విడిగా ఉండటమే మంచిదని నిర్ణయించుకున్నాం. ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంత కష్టమైనా భరిస్తాను అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో 2015లో ప్రేమలో పడ్డారు. 2020లో పెళ్లి చేసుకున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది