Nayanathara : ఆయన మా ఆయన.. ఏం రాస్తారో.. ఎలా రాస్తారో ఇప్పుడు రాయండి : నయనతార

Authored By vamana sai | The Telugu News | Updated on: August 16, 2021, 10:36 am

Nayanathara: సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతారకి ఉన్న స్టార్ డం గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో అలా అలా నెట్టుకొచ్చిన ఈమె ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో నిర్మాతలకి అందని ద్రాక్షపండులా మారింది. నయనతార డేట్స్ కావాలంటే సంవత్సరం ముందే ఆమెని సంప్రదించి అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ లాక్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతగా నయనతార క్రేజ్ సంపాదించుకుంది. యంగ్ హీరోల దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ రజనీకాంత్, అజిత్ లాంటి స్టార్స్ వరకు అందరితోనూ నటించింది.

nayanathara-says he is her husband

nayanathara-says he is her husband

అంతేకాదు గత కొంతకాలంగా నయనతార లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ప్రిఫరెన్స్ ఇస్తోంది. ఆ సినిమాల పరంగా కూడా నయన్ మంచి హిట్స్ అందుకుంటోంది. అలా ఆమె క్రేజ్ అంతకంతా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. సీనియర్ హీరోయిన్ అయ్యాక నెమ్మదిగా అవకాశాలు తగ్గడం మొదలవుతాయి. కానీ నయన్ కి మాత్రం అవకాశాలు పెరుగుతున్నాయి. పైగా ఆమె ప్రమోషన్స్ కి రాను అంటే కూడా పర్వాలేదనే నిర్మాతలు రెడీ అవుతున్నారు. కాగా ఈ మధ్య నయనతార తన పెళ్ళికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పి హాట్ టాపిక్ గా మారింది. ఇది చాలా మందికి సర్‌ప్రైజ్ అయితే కొంతమందికి మాత్రం షాకింగ్ విషయం.

nayanathara-says he is her husband

nayanathara-says he is her husband

Nayanathara: ఇప్పటి వరకు చాలా రూమర్స్ రాశారు.

గతంలో నయనతార ప్రేమలో రెండుసార్లు విఫలమైంది. ఒకసారి శింబుతో, ఒకసారి ప్రభుదేవాతో. దాంతో నయన్ మీద నెగిటివ్ కామెంట్స్ బాగా వచ్చాయి. ఆ తర్వాత దర్శక, నిర్మాత విగ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. చాలాకాలంగా వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. దాంతో ఈ బంధం ఎప్పుడు బెడిసికొడుతుందో అని మాట్లాడుకున్నారు.

nayanathara-says he is her husband

nayanathara-says he is her husband

కానీ ఇటీవల ఆమెకి విగ్నేష్‌తో ఎంగేజ్‌మెంట్ అయింది అంటూ రింగ్ చూపించి క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ వేడుకకి ఇరు కుటుంబాలకు చెందిన వారు మాత్రమే హాజరయ్యారని చెప్పింది. అంతేకాదు ఇప్పటి వరకు చాలా రూమర్స్ రాశారు. ఇకపై విగ్నేష్ మాయన..ఇప్పుడు రాసుకోండి ఏం రాసుకుంటారో అంటూ క్లారిటీ ఇచ్చింది. కాగా వీరి వివాహం ఎప్పుడు జరగనుందనేది మాత్రం తెలపలేదు.

ఇది కూడా చ‌ద‌వండి ==> శ్రీముఖి శేఖర్ మాస్టర్‌కి ఎందుకు ముద్దు పెట్టిందో ఓపెన్‌గా చెప్పేసింది

ఇది కూడా చ‌ద‌వండి ==>  హీరో హీరోయిన్లుగా మారబోతోన్న క్రేజీ జంట.. తెరపైకి యాంకర్ రష్మీ-సుధీర్!

ఇది కూడా చ‌ద‌వండి ==> జాతీయ జెండాను అవమానించిన రామ్ చరణ్? భగ్గుమంటున్న నెటిజన్లు?

ఇది కూడా చ‌ద‌వండి ==> మోనిత శవాన్ని కార్తీక్ ఎక్కడ దాచాడో.. దీపకు చెబుతాడా? దీప ఆ విషయాన్ని ఏసీపీకి చెబుతుందా?

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp