Hero Suman : ఫస్ట్ టైం భార్య గురించి నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: May 13, 2023, 1:30 pm

Hero Suman : నటుడు సుమన్ అందరికీ సుపరిచితుడే. సినిమా రంగంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు మనోడు చేయడం జరిగింది. హీరోగా కెరియర్ ప్రారంభంలో దక్షిణాది సినిమా రంగంలో వరుస పెట్టి విజయాలు అందుకున్నాడు. సుమన్ దాటికి.. గ్లామర్ మరియు ఫైట్స్ కి అప్పటి టాప్ హీరోలు బెంబేలెత్తిపోయారు. మంచి కలర్ తో పాటు అదిరిపోయే ఫిజిక్ ఉండటంతో చాలామంది అమ్మాయిలకు అప్పట్లో సుమన్ ఓ లవర్ బాయ్ లాంటోడు. ఒకపక్క మాస్ ప్రేక్షకులను మరోపక్క అమ్మాయిలను ఉర్రూతలూగిస్తూ… తిరుగులేని విజయాలు అందుకుంటున్న సుమన్..

suman-fire-on-youtube-channel

suman-fire-on-youtube-channel

ఒక్కసారిగా ఓ కేసులో అన్యాయంగా జైలుకెళ్లడం జరిగింది. ఇది సుమన్ సినీ కెరియర్ లో ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. అయితే ఇదంతా సుమన్ ఎదుగుదలను తట్టుకోలేక కుట్రపూరితంగా కొంతమంది చేసిందని అంటుంటారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం సుమన్ క్యారెక్టర్ సపోర్టింగ్ పాత్రలతో పాటు నెగిటివ్ పాత్రలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ వెబ్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం తన భార్య గురించి సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలు నుంచి వచ్చాక తనకు పెళ్లయిందని తెలిపారు.

Hero Suman Great Words About His Wife in Actor Suman Interview

Hero Suman Great Words About His Wife in Actor Suman Interview

 

తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిని తాను పెళ్లి చేసుకున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రామారావు, నాగేశ్వరరావు వంటి పెద్ద హీరోల సినిమాలకు రచయితగా పనిచేసిన వ్యక్తి యొక్క కుమార్తెనీ తాను చేసుకున్నట్లు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని పెళ్లాడినట్లు తెలిపారు. ఇక జైలుకి వెళ్లటం వంటి విషయాలు ఎక్కడ వారికి తెలియకపోయినా గాని తమిళ మీడియాకి అంతా తెలుసు. సో….భార్య కుటుంబానికి నాపై జరిగిన కుట్ర అంత తెలుసు.. పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అన్నట్టు.. వాళ్లు కూడా అర్థం చేసుకున్నారని సుమన్ తన భార్య గురించి.. పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Breaking News

No bio available for this author.

  1. "Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి హనోయ్ వెకేషన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు!"

  2. "Avinash Reddy : వేల కొద్దీ డాక్యుమెంట్లతో ఈడీ ముందుకొచ్చిన అవినాష్ రెడ్డి.. తాడేపల్లిలో మొదలైన టెన్షన్..!"

  3. "Ranabaali Movie First Review : రణబాలి మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ..!"

  4. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  5. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  6. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  7. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp