Venkatesh Daughter Aashritha : వెంకటేష్ పెద్ద కూతురు యూట్యూబ్ ద్వారా నిజంగా అంత సంపాదిస్తుందా?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 10, 2022, 11:30 am

Venkatesh Daughter Aashritha : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత యూట్యూబర్ అనే విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత విభిన్నమైన వంటకాలను యూట్యూబ్ ద్వారా జనాలకు ఈమె పరిచయం చేస్తుంది. ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన హోటల్స్ మరియు రెస్టారెంట్స్ గురించి ఆమె వివరిస్తూ అందులో ఉన్న ఫుడ్ ను జనాలకు తెలియజేసే తీరు ఆకట్టుకుంటుంది. ఆమె వీడియో లో మాట్లాడే విధానం భలే ఉంటుందని అంతా అనుకుంటూ ఉంటారు. తాజాగా నాగచైతన్యతో కలిసి ఈమె చేసినా ఒక ఎపిసోడ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

హైదరాబాదులో నాగ చైతన్యకు ఒక ప్రత్యేకమైన వంటకాలను అందించే హోటల్ ఉంది. ఆ హోటల్లో నాగచైతన్య తో కలిసి ఆశ్రిత సందడి చేసింది. హైదరాబాదులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ హోటల్స్ చాలా వరకు తమ హోటల్ లో అశ్రిత ఒక వీడియో చేయాలని కోరుకుంటారట. ఆమెకు ఉన్న ఫాలోవర్స్ రెండు లక్షల అయినా కూడా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు ఈమె యొక్క వీడియోలను ఫాలో అవుతూ.. ఆమె ఇచ్చే రివ్యూ ఆధారంగా ఆయా హోటల్స్ ని ఎంపిక చేసుకుంటారట. అందుకే ఆమెకు యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం కంటే బ్రాండింగ్ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ అన్నట్లుగా సమాచారం అందుతుంది.

hero Venkatesh Daughter Aashritha youtube income

hero Venkatesh Daughter Aashritha youtube income

అశ్రిత నెల నెల భారీ మొత్తంలోనే ఆదాయాన్ని యూట్యూబ్ ద్వారా సొంతం చేసుకుంటుందట. ఆమె లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వీడియోల రూపంలో షేర్‌ చేస్తూ డబ్బులు సంపాదించడం నిజంగా అభినందనీయం అంటున్నారు. ఎంతో మంది అమ్మాయిలు ఈమెని చూసి నేర్చుకోవచ్చని.. భర్త తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఇలా సొంతంగా కష్టపడుతూ తమను తాము తెలుసుకుంటూ ముందుకు సాగడం అశ్రిత నుండి నేర్చుకోవాలి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి యూట్యూబ్‌ వీడియోలకు మంచి పాపులారిటీ ఉంటుంది కనుక ఆమెకు భారీగానే డబ్బులు వస్తూ ఉంటాయి.. కనుక ముందు ముందు కూడా ఆమెకు మరిన్ని విజయాలు సాధ్యం అవ్వాలని కోరుకుందాం.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp