Sankranthiki Vasthunnam Movie : నేను పాడుతా అని… ఏం పాడావ్ వెంకీ.. దుమ్ములేపావ్‌పో..!
ప్రధానాంశాలు:
Sankranthiki Vasthunnam Movie : నేను పాడుతా అని... ఏం పాడావ్ వెంకీ.. దుమ్ములేపావ్‌పో..!
Sankranthiki Vasthunnam Movie : విక్టరీ వెంకటేష్ అనీల్ రావిపుడి కాంబోలో వస్తున్న థర్డ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనీల్ రావిపుడి మార్క్ ఎంటర్టైనర్ తో పాటు వెంకటేష్ మార్క్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అందులో గోదారి గట్టు మీద సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. రెండో సాంగ్ గా వచ్చిన మీను సాంగ్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.
ఇక లేటెస్ట్ గా థర్డ్ సాంగ్ ప్రోమో వచ్చింది. సూపర్ హిట్ పొంగల్ సాంగ్ ని ఎవరితో పాడించాలని అనీల్ రావిపుడి ఆలోచిస్తుంటే నేను పాడుతా నేను పాడుతా అంటూ వెంకటేష్ వెంట పడతాడు. 30న ఈ సాంగ్ రిలీజ్ అవుతుండగా లేటెస్ట్ గా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. భీమ్స్ సిసీలియో మ్యూజిక్ కి వెంకటేష్ ఎనర్జీ తోడై సాంగ్ సూపర్ గా వచ్చింది. వెంకీ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా అది అదిరిపోయింది.
Sankranthiki Vasthunnam Movie వెంకటేష్ పాట పాడటం..
ఈ సాంగ్ ప్రోమో విన్న ఫ్యాన్స్ నేను పాడుతా నేను పాడుతా అని చెప్పి ఏం పాడావ్ వెంకీ అనేస్తున్నారు. వెంకటేష్ పాట పాడటం అనేది చాలా స్పెషల్. ఇక ఆ సాంగ్ పొంగల్ సాంగ్ అవ్వడం సూపర్ అనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం తో వెంకటేష్ తప్పకుండా సూపర్ హిట్ కొట్టబోతున్నాడు. పొంగల్ రేసులో రాం చరణ్, బాలకృష్ణ సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలతో పాటు వెంకటేష్ సినిమా వస్తుంది.
సాంగ్స్ తో సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచగా త్వరలో టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచనున్నారు. వెంకటేష్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా ఈ సినిమా ఏం చేస్తుందో చూడాలి. Venkatesh, Anil Ravipudi, Sankranthiki Vasthunnam Movie .