Hero Vishal : టీజ‌ర్ లాంచ్ లో న‌టుడి చెంప చెల్లుమ‌నిపించిన హీరో విశాల్…. అస‌లు ఏమైందంటే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hero Vishal : టీజ‌ర్ లాంచ్ లో న‌టుడి చెంప చెల్లుమ‌నిపించిన హీరో విశాల్…. అస‌లు ఏమైందంటే

 Authored By prabhas | The Telugu News | Updated on :27 July 2022,9:00 pm

Hero Vishal : హీరో విశాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. త‌మిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ తెలుగులో ప్రేమ‌చ‌ద‌రంగం సినిమాతో ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత పందెంకోడి సినిమాతో ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాధించుకున్నాడు. ఎక్కువ‌గా యాక్ష‌న్ సినిమాలు చేసే విశాల్ త‌న సినిమాలు ప్ర‌త్యేకంగా ఉండేలా చూసుకుంటాడు. ఎక్కువ‌గా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే సొంత బ్యాన‌ర్ విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ తో ఎన్నో సినిమాల‌ను నిర్మించారు. అలాగే న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడిగా సేవ‌లందించారు. విశాల్ సినిమాలు ఎక్కువ‌గా త‌మిళ్ నుంచి తెలుగులోకి డ‌బ్బింగ్ అవుతుంటాయి.

కాగా ఇటీవ‌ల సామాన్యుడు సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. అయితే ఈ సినిమా అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇక విశాల్ వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో కూడా వార్త‌ల్లో నిలుస్తుంటారు. అయితే ఇప్పటికే విశాల్‌కు నటి అనీషా అల్లారెడ్డితో నిశ్చితార్థం జ‌రిగింది. కానీ కొద్ది రోజులకే పెళ్లిని ర‌ద్దు చేసుకున్నారు. ఆ త‌ర్వాత ప్రముఖ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ తో ప్రేమ‌లో ఉన్నట్లు వార్తలు వ‌చ్చాయి. దీనిపై ఇద్ద‌రూ స్పందించ‌లేదు. కాగా తాజాగా ఓ యువతితో పీకల లోతు ప్రేమలో ఉన్నట్లు విశాల్ చెప్పాడు. త్వరలోనే ఆ అమ్మాయి ఎవ‌రో కూడా చేబుతాన‌ని అన్నాడు. దీంతో విశాల్ ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ప్ర‌స్తుతం విశాల్ ల‌ఠీ అనే సినిమాలో న‌టిస్తున్నారు.

Hero Vishal Slap Robo Shankar video on youtube

Hero Vishal Slap Robo Shankar video on youtube

వినోద్ కుమార్‌ డైరెక్షన్‌లో వ‌స్తున్న ఈ మూవీ ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఇందులో సునైనా హీరోయిన్‌గా నటిస్తుండగా రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ లో విశాల్ కాలికి గాయం కూడా అయింది. కాగా తాజాగా లాఠీ టీజ‌ర్ లాంచ్ లో ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. నటుడు రోబో శంకర్‌ స్టేజిపై విశాల్ తో మాట్లాడుతుండ‌గా విశాల్ ఒక్కసారిగా చెంప చెల్లుమ‌నిపించాడు. దీంతో అంద‌రూ షాక్ లో ఉండిపోయారు. ఆ ప‌క్క‌నే ఉన్న మ‌రో వ్య‌క్తి స్టేజి దిగి వెళ్లిపోతుండ‌గా న‌వ్వ‌డంతో ఇది ఫ్రాంక్ అని తెలిసి అంద‌రూ న‌వ్వేసారు.

YouTube video

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది