Home » Entertainment » Heroin Dimple Hayati In Venu Swamy
Entertainment

Venu Swamy : వేణు స్వామి తో హీరోయిన్ డింపుల్ హయాతి పెద్ద నిర్ణయం – దండం పెట్టేసిన ఆమె ఫ్యామిలీ !

Authored By
aruna
The Telugu News | Updated on: June 26, 2023 1:17 pm
Advertisement

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి అందరికి తెలిసే ఉంటుంది. సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. అంతేకాదు ఒకోసారి వివాదాల్లో కూడా చిక్కుకుంటాడు. హీరో హీరోయిన్ల జాతకాలు గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యాడు. ఇటీవల రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పాప పుట్టింది. పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పాడు. రామ్ చరణ్ పాపది గొప్ప జాతకమని, కీర్తి లో రామ్ చరణ్ ఉపాసనలను మించి పోతుందని చెప్పాడు. అదేవిధంగా ఆ పాప చిన్నచిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుందని కూడా వెల్లడించారు. ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు అతడిని ఫాలో అవుతుంటారు.

Advertisement

ఆయన చెప్పే జాతకాలు నమ్ముతుంటారు. అతనితో పూజ చేయించుకుంటే కెరియర్ సక్సెస్ఫుల్గా సాగుతుందని విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే స్టార్ బ్యూటీ రష్మిక మందన ఆయన దగ్గర ప్రత్యేక పూజలు చేయించుకొని ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. రష్మిక మందన అంతలా ఎదగటానికి వేణు స్వామి పూజలే కారణం అని అంటుంటారు. ఇక ఈ మధ్య నిధి అగర్వాల్ కూడా వేణు స్వామి దగ్గర కొన్ని పూజలు చేయించుకుంది. తాజాగా హైదరాబాద్ బ్యూటీ డింపుల్ హయాతి కూడా వేణు స్వామిని సంప్రదించినట్లు తెలుస్తుంది. రహస్యంగా వేణు స్వామి తో కొన్ని పూజలు కూడా చేయించుకుని దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Heroin Dimple Hayati in Venu Swamy

Advertisement

డింపుల్ హయాతి కెరియర్ అంతగా బాగోలేదు. ఆమెకు సినీ ఆఫర్స్ వస్తున్న ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్టు పడడం లేదు. రవితేజతో ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించిన అంతగా గుర్తింపు రాలేదు. ఇక తర్వాత గోపీచంద్ లేటెస్ట్ మూవీ రామబాణం కూడా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అలాగే ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే ఆమె మీద కేసు పెట్టాడు. తన వాహనాన్ని ఆమె కాలుతో తన్నినట్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే డింపుల్ ఈ కేసు లో విచారణ ఎదుర్కొంటుంది. ఈ సమస్యల నుండి బయటపడడానికి డింపుల్ హయాతి వేణు స్వామి సంప్రదించినట్లు తెలుస్తుంది. నివారణకు ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నట్లు తెలుస్తుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి