Hansika : హీరోయిన్ హన్సిక మెహందీ వేడుక .. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.. వీడియో | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Hansika : హీరోయిన్ హన్సిక మెహందీ వేడుక .. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.. వీడియో

Hansika ; హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ దేశముదురు ‘ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా చేసే నాటికి హన్సిక వయసు 16 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చి తొలి సినిమాతోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :3 December 2022,2:20 pm

Hansika ; హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ దేశముదురు ‘ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా చేసే నాటికి హన్సిక వయసు 16 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చి తొలి సినిమాతోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా హిట్ తర్వాత హన్సిక వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.

తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన హన్సిక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలెక్కతుంది. ప్రముఖ బిజినెస్మెన్ సోహెల్ కతూరియాను త్వరలోనే వివాహం చేసుకోబోతుంది. జైపూర్ లో ఆమె వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. మెహందీ వేడుకనుండి కాబోయే వధువు యొక్క అనేక ఫోటోలు మరియు వీడియోలు శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడ్డాయి.

heroin Hansika function video viral

heroin Hansika function video viral

ఇక సోషల్ మీడియా క్లిప్ లో హన్సిక తన మెహందీ ని ధరించి డాన్స్ వేస్తూ కనిపించింది. హన్సిక సోహెల్ కలిసి ఒక సోఫాలో కూర్చున్నారు. అతను ఆమెను కొన్ని డ్యాన్స్ స్టెప్పులు చూపించమని అడిగాడు. హన్సిక నవ్వుతూ స్టెప్పులు చూపించగా ఇద్దరు కలిసి స్టెప్పులు వేశారు. కాసేపటికి హన్సిక ఇక స్టెప్పులు తెలియడం లేదని తల ఊపడంతో ఆ వీడియో ముగిసింది. హన్సిక తన మెహందీ చేతులకు కొంతమంది అప్లై చేయడంతో ఆమె చేతులను చూసుకుంది. ఆమె స్నేహితుడు క్లిప్ ను రికార్డ్ చేయడంతో సోహెల్ నవ్వుతూ ఫోజులిచ్చాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది