Heroin Meena : హీరోయిన్ మీనా తల్లి మామూలుది కాదు వామ్మో .. ఆ హీరో తలెత్తుకోలేకుండా చేసింది !
Heroin Meena : సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన అందం, అభినయంతో కుర్రాళ్ళ మనసులు దోచింది. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించింది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలు అందరితో జతకట్టి మెప్పించింది. ఇక నాలుగు పదుల వయసు పెరిగిన ఆమె అందం మాత్రం ఇప్పటికి చెక్కుచెదరలేదు. ఇకపోతే ఆమె భర్త విద్యాసాగర్ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. భర్త చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
ఆమె కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక కోలీవుడ్లో రజినీకాంత్ తర్వాత ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు అజిత్ కుమార్. ఈయనకు తమిళంతోపాటు తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. అయితే ఇటీవల అజిత్ మరో వ్యాపారం మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఏకే మోటో రైట్స్ అనే కంపెనీ ఏర్పాటు చేసి ఔత్సాహిక మోటో రైడర్స్ కి సహకారం అందించే ప్లాన్ లో ఉన్నారు.
ఇక నటి మీనా, అజిత్ కలిసి గతంలో ఆనంద పుంకంట్రు అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాదు అజిత్ కు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా వచ్చింది. ఈ సందర్భంగా ఓ వేదికపై అజిత్ కు మీనా అవార్డు ఇచ్చింది. ఆ సందర్భంలో అజిత్, మీనా కలిసి స్టేజ్ పై డ్యాన్స్ చేయాలంటే హోస్ట్ కోరాడు. ఇది విన్న మీనా తల్లి వెంటనే స్టేజి మీదకు వచ్చి మీనా చేయి పట్టుకొని తీసుకెళ్ళింది. మీనా తల్లి అలా చేయడంతో అజిత్ అందరిముందు అవమానించబడ్డాడు. అయితే మీనా తల్లి అందరు చూస్తుండగానే అలా చేయడంతో ఆమె తీరుపై కొందరు నటులు తప్పుబట్టినట్లు వార్తలు కూడా వచ్చాయి.