Amala Paul : టాలీవుడ్‌ లో హీరోయిన్స్ తో వాళ్లు ఆడుకుంటారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన అమలా పాల్

Authored By aruna | The Telugu News | Published on: September 13, 2022, 11:00 am

Amala Paul : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడి నుండి టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అమలాపాల్ గత కొంత కాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈమె ఆ మధ్య దర్శకుడితో ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది. కానీ అతి తక్కువ సమయంలోనే అతడి నుండి విడిపోయి విడాకులను కూడా తీసుకుంది. విడాకుల తర్వాత మళ్లీ వరుసగా సినిమాల్లో నటించాలని ఈ అమ్మడు ఆశపడింది. కానీ అనూహ్యంగా టాలీవుడ్లో ఈమెకు రీ ఎంట్రీ దక్క లేదు చిన్నా చితక సినిమాల్లో అవకాశాలు వస్తే ఈమె పట్టించుకోలేదు.

అలాగే హీరోయిన్ గా తమిళ్లో మరియు హిందీలో అడపాదడప వస్తున్న ఆఫర్లతో కెరియర్ ని నెట్టుకు వస్తుంది. ఈ సమయంలో ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో తనకు ఆఫర్లు రావడం లేదంటూ తీవ్ర అక్కస్సును వెళ్లగక్కింది. తెలుగులో పలు సినిమాలు నటించిన ఇన్నాళ్లకు ఈ అమ్మడికి అక్కడ హీరోయిన్స్ కి ప్రాముఖ్యత ఇవ్వరు.. హీరోయిన్స్ ని అక్కడ ఒక ఆట బొమ్మలా చూస్తారు అని తీవ్రంగా విమర్శలు చేసింది. కేవలం హీరోయిన్స్ సినిమాల్లో వాడుకోవడానికి అన్నట్లుగా కొందరు చూస్తారని ఆరోపించింది. అలాగే టాలీవుడ్ లో ఉన్న కొన్ని ఫ్యామిలీస్ ఇండస్ట్రీని ఏలేసేందుకు ప్రయత్నిస్తాయని వారి చుట్టే ఇండస్ట్రీ మొత్తం ఉంటుందని వారిని మచ్చిక చేసుకున్న వారికి ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు అవకాశాలు వస్తాయంటూ అమలాపాల్ తీవ్ర వ్యాఖ్యలను చేసింది.

heroine Amala Paul shocking comments on tollywood

heroine Amala Paul shocking comments on tollywood

ఈ విమర్శలను టాలీవుడ్ కి చెందిన కొందరు తిప్పికొడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాలు రావడం లేదు అనే ఉద్దేశంతోనే తన కోపాన్ని ఇలా వ్యక్తం చేస్తుందని.. అమలాపాల్ పై కొందరు తెలుగు సినీ జనాలు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆమె టాలీవుడ్ కి మరియు టాలీవుడ్ సినీ పెద్దలకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక ముందు కూడా ఆమెకు తెలుగు సినిమాల్లో ఆఫర్లు ఇవ్వకూడదు అంటూ కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఆమె విమర్శలకు పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు అమలాపాల్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

aruna

No bio available for this author.

  1. "PM Kisan 25th Installment : రూ.2,000 కోసం ఎదురుచూస్తున్న రైతులకు అలర్ట్.. ఈ 5 పనులు వెంటనే పూర్తి చేయండి!"

  2. "Gold Adulteration Alert : కొత్త మోసం.. 22 క్యారెట్ల పేరుతో 20 క్యారెట్ల బంగారమా..? 916 హాల్‌మార్క్ ఉన్నా జాగ్రత్త పడాల్సిందేనా?"

  3. "Vaibhav Sooryavanshi : 16 బంతుల్లో ఫిఫ్టీ.. 28 బంతుల్లో సెంచరీ.. ప్రపంచ రికార్డు బద్దలు!"

  4. "Samvidhan Raksha March : ప్రతి డివిజన్ నుంచి 100 మంది రావాలి.. డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ పిలుపు!"

  5. "Janasena Party : కూటమిలో ఉంటూనే జనసేన సొంత బలం పెంచుకుంటోందా?.. ప‌వ‌న్‌ది ఏం ప్లాన్ గురూ..!"

  6. "WhatsApp Web : వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. ఈ చిన్న తప్పుతో మీ అకౌంట్ ప్రమాదంలో పడొచ్చు!"

  7. "Trisha Politics : మరో జయలలితగా త్రిష?.. విజయ్‌తో రాజకీయాల్లోకి వస్తారా? అభిమానుల కొత్త ప్లాన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp