
heroine Amala Paul shocking comments on tollywood
Amala Paul : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడి నుండి టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అమలాపాల్ గత కొంత కాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈమె ఆ మధ్య దర్శకుడితో ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది. కానీ అతి తక్కువ సమయంలోనే అతడి నుండి విడిపోయి విడాకులను కూడా తీసుకుంది. విడాకుల తర్వాత మళ్లీ వరుసగా సినిమాల్లో నటించాలని ఈ అమ్మడు ఆశపడింది. కానీ అనూహ్యంగా టాలీవుడ్లో ఈమెకు రీ ఎంట్రీ దక్క లేదు చిన్నా చితక సినిమాల్లో అవకాశాలు వస్తే ఈమె పట్టించుకోలేదు.
అలాగే హీరోయిన్ గా తమిళ్లో మరియు హిందీలో అడపాదడప వస్తున్న ఆఫర్లతో కెరియర్ ని నెట్టుకు వస్తుంది. ఈ సమయంలో ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో తనకు ఆఫర్లు రావడం లేదంటూ తీవ్ర అక్కస్సును వెళ్లగక్కింది. తెలుగులో పలు సినిమాలు నటించిన ఇన్నాళ్లకు ఈ అమ్మడికి అక్కడ హీరోయిన్స్ కి ప్రాముఖ్యత ఇవ్వరు.. హీరోయిన్స్ ని అక్కడ ఒక ఆట బొమ్మలా చూస్తారు అని తీవ్రంగా విమర్శలు చేసింది. కేవలం హీరోయిన్స్ సినిమాల్లో వాడుకోవడానికి అన్నట్లుగా కొందరు చూస్తారని ఆరోపించింది. అలాగే టాలీవుడ్ లో ఉన్న కొన్ని ఫ్యామిలీస్ ఇండస్ట్రీని ఏలేసేందుకు ప్రయత్నిస్తాయని వారి చుట్టే ఇండస్ట్రీ మొత్తం ఉంటుందని వారిని మచ్చిక చేసుకున్న వారికి ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు అవకాశాలు వస్తాయంటూ అమలాపాల్ తీవ్ర వ్యాఖ్యలను చేసింది.
heroine Amala Paul shocking comments on tollywood
ఈ విమర్శలను టాలీవుడ్ కి చెందిన కొందరు తిప్పికొడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాలు రావడం లేదు అనే ఉద్దేశంతోనే తన కోపాన్ని ఇలా వ్యక్తం చేస్తుందని.. అమలాపాల్ పై కొందరు తెలుగు సినీ జనాలు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆమె టాలీవుడ్ కి మరియు టాలీవుడ్ సినీ పెద్దలకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక ముందు కూడా ఆమెకు తెలుగు సినిమాల్లో ఆఫర్లు ఇవ్వకూడదు అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఆమె విమర్శలకు పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు అమలాపాల్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.