Heroine bhavana emotional about her incident
Actress Bhavana : మహాత్మ సినిమాతో శ్రీకాంత్ సరసన ఆకట్టుకున్న హీరోయిన్ భావన తెలుగు ప్రజలకు సుపరిచితమే. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో గోపిచంద్ తో ఒంటిరి సినిమాలో మెరిసింది. ఇక ఆ తర్వాత సౌత్ లోని ఇతర భాషలలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసి తనకుంటూ ప్రతేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అప్పట్లో ఈమెకు జరిగిన సంచలన ఘటన ఒక్కసారిగా అందరినీ కుదిపేసింది. 2017 లో కొచ్చిలో ఒక లొకేషన్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని తన స్నేహితుడు, యాక్టర్, డైరెక్టర్ లాల్ ఇంటికి వెళ్లడానికి బయలుదేరింది.
అయితే అదే రోజు భావనపై కారులో లైంగిక దాడి జరగడం ఓ సంచలనంగా మారింది. ఇక ఈ వ్యవహారంలో ఓ సెలబ్రెటీ కూడా ఉండటంతో మరింత సంచలనంగా మారింది.ఇక లైంగిక దాడి జరగడానికి తన కార్ డ్రైవర్ ప్రమేయం కూడా ఉండడంతో ముందుగానే ఓ పథకం ప్రకారం దాడి చేసినట్లు పోలీసులు తేల్చారు. కారులోకి ప్రవేశించిన దుండగులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ బట్టలు చించేసారు. ఇలా దాదాపు రెండు గంటల పాటు లైంగికంగా చిత్రహింసలు పెట్టి తర్వాత తనని ఫ్రెండ్ ఇంటి ముందు వదిలిపెట్టారు. ఇక వారి నుంచి తప్పించుకున్న భావన ఒంటిని కవర్ చేసుకుంటూ తన ఫ్రెండ్ ఇంటిలోకి వెళ్లింది. ఇక ఫ్రెండ్ లాల్ సహాయంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.
Heroine bhavana emotional about her incident
సాధారణంగా లైంగిక దాడి జరిగినప్పుడు వారి పేరు వివరాలు గోప్యంగా ఉంచుతారు.. కానీ పోలీసుల ద్వారా ఈ విషయం మీడియాకు తెలియడంతో రెండు గంటల పాటు కారులో లైంగిక వేధింపులకు గురైన నటి భావన అంటూ హెడ్ లైన్స్ వేయడం సంచలనంగా మారింది. అయితే ప్లాన్ ప్రకారమే తనపై లైంగిక దాడి జరిగిందన్న భావన ఏకంగా స్టార్ నటుడు దిలీప్ పేరు ఇన్వాల్వ్ అయ్యాడనడంతో హాట్ టాపిక్ గా మారింది. అయితే నటుడు దిలీప్ పై ఆరోపణలు చేయడంతో మొదట్లో మద్దతు ఇవ్వలేదు. అయితే సోషల్ మీడియా వేదికగా తనకు మద్దతు లభించడంతో ఇక నటీనటులు కూడా ఒక్కొక్కరిగా మద్దతు ప్రకటించారు. ఇక దాడి జరిగినట్లు సాక్షాధారాలు ఉండటంతో దిలీప్ మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు.
అయితే ఈ ఇష్యూ తర్వాత భావన తేరుకుని ఘటన జరిగిన ఐదు ఏళ్లకు మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఒక సాధారణ మహిళలనని.. తాను కూడా ఒక చిన్న కుటుంబం నుంచే పరిశ్రమలోకి వచ్చానని గుర్తుచేసుకున్నారు. అయితే నిందితులపై కేసు పెట్టినప్పటికీ తనపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వారి దగ్గర ఉన్నాయని.. అయితే ఆ వీడియోలను ఎప్పుడైనా బయటపెట్టోచ్చని బాధపడింది. ఆ ఫోటోలు వీడియోలు బయటకు వచ్చిన రోజు సోషల్ మీడియాలో.. తాను నవ్వుతూ ఉండే ఫోటోలు కాకుండా.. దాడి చేసిన వారి ఫోటోలు అలాగే తన వీడియోలు మాత్రమే కనపడతాయని తన ఆవేదనను చెప్పుకొచ్చింది.
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
This website uses cookies.