Heroine : వన్ నైట్ కోసం రూ.35 లక్షలు తీసుకుంటున్న హీరోయిన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heroine : వన్ నైట్ కోసం రూ.35 లక్షలు తీసుకుంటున్న హీరోయిన్

 Authored By ramu | The Telugu News | Updated on :23 May 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Heroine : వన్ నైట్ కోసం రూ.35 లక్షలు తీసుకుంటున్న హీరోయిన్

Heroine  :  ‘డ్రాగన్’ సినిమా ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయిన కయాదు లోహర్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, కన్నడ, మలయాళ, తెలుగు సినిమాల్లో అవకాశాలు పొందిన ఈ నటి ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ‘అల్లూరి’ సినిమాతో తెలుగులోనూ గుర్తింపు పొందిన కాయదు, ఇటీవల తమిళనాడులో వెలుగులోకి వచ్చిన TASMAC స్కామ్‌కు సంబంధించి సంచలన ఆరోపణల పాలైంది.

Heroine వన్ నైట్ కోసం రూ35 లక్షలు తీసుకుంటున్న హీరోయిన్

Heroine : వన్ నైట్ కోసం రూ.35 లక్షలు తీసుకుంటున్న హీరోయిన్

తాజా సమాచారం ప్రకారం.. TASMAC స్కామ్‌కు సంబంధించి ప్రధాన నిందితులు నిర్వహించిన నైట్ పార్టీల్లో కాయదు హాజరైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతటితో ఆగకుండా, ఆ పార్టీలకు హాజరవడానికి ఆమె ఒక్క నైట్ కు రూ.35 లక్షల వరకు తీసుకుందన్న వాదనలు కోలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, కాయదు పేరు కూడా ఆ విచారణలో బయటపడినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. ఈ ఆరోపణలు అధికారికంగా రుజువైతే, కాయదు కెరీర్‌కు పెద్ద దెబ్బ తగలే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘డ్రాగన్’ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో బిజీగా మారిన కాయదు, ఇప్పుడిలా వివాదాల్లో చిక్కుకోవడం ఆమెకు నష్టాన్ని కలిగించవచ్చు. అయితే కాయదు ఈ విషయంపై ఇంకా స్పందించకపోవడం, అలాగే అధికారులు కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో పరిశ్రమలో ఉత్కంఠ నెలకొంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది