Jabardasth Laila : ఇలా అయితే ఎలా లైలా?.. జబర్దస్త్ షోపై నెటిజన్ల కామెంట్లు వైరల్
Jabardasth Laila : వెండితెరపై లైలా నవ్వులకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆమె మొహంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ పలకకపోయినా నవ్వు మాత్రం బాగానే ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ మీద లైలా నవ్వులకు చాలా మంది అభిమానులే ఉన్నారు. కానీ ఈ మధ్య లైలాకు తెరపై అవకాశాలు రావడం లేదు. గతంలో ఎప్పుడో ఓ సారి చివరగా నువ్వే కావాలి సినిమాకు స్పెషల్ సాంగ్ చేసినట్టుంది.అయితే లైలా ఈ మధ్య బుల్లితెరపై ఫోకస్ పెట్టేసింది.
అది కూడా కామెడీ షోలకు న్యాయ నిర్ణేతలుగా ఫిక్స్ అయ్యేందుకు లైలా బాగానే ట్రై చేస్తోన్నట్టుంది. కానీ అది ఏ మాత్రం కూడా వర్కవుట్ అవ్వడం లేదు. లైలా నవ్వులు బాగానే ఉన్నా.. ఆమె టైమింగ్ గానీ, జడ్జ్ మెంట్ గానీ ఏ మాత్రం బాగా లేదు. ఇక స్కిట్లో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తే మాత్రం నోరెళ్లబెట్టేస్తోంది.డైలాగ్ చెప్పడంతో తెల్లమొహం వేస్తోంది. ఇక స్కిట్లోనూ అవసరానికి మించి నవ్వుుతున్నట్టుంది. దీంతో నెటిజన్లు లైలాను ఏకిపారేస్తున్నారు.

Heroine Laila May Not Accept by audience in jabardasth
అసలే రోజా, ఇంద్రజలు అక్కడ దుమ్ములేపేస్తోన్నారు. ఆమని కూడా అంతో ఇంతో ట్రై చేస్తోంది. ఇలా ఈ ముగ్గురి మధ్య లైలా నిలబడటం అంటే మామూలు విషయం కాదు. మరి లైలా ఇంకెన్ని రోజులు ఇలా కనిపిస్తుందో చూడాలి.అసలే రోజా కూడా వెళ్లిపోతుందనే టాక్ ఎక్కువగా వస్తోంది. ఒక వేళ రోజా వెళ్లిపోతే ఆ స్థానాన్ని కవర్ చేసేందుకు ఇంద్రజ రెడీగానే ఉంది. ఆమని కూడా ప్రయత్నిస్తోన్నట్టుంది. మరి లైలా మాత్రం చివరకు ఎలా మిగులుతుందో చూడాలి.
