Roja Re Entry : అత్త పాత్రలో అదరగొట్టిన రోజా.. రీఎంట్రీ అదిరిపోయిందిగా..!
ప్రధానాంశాలు:
Roja Re Entry : అత్త పాత్రలో అదరగొట్టిన రోజా.. రీఎంట్రీ అదిరిపోయిందిగా..!
Roja Re Entry : ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రోజా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి మెప్పించింది.. జబర్దస్త్ టీవీ షోలో జడ్జిగా ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్ల పాటుఆ షోలో మాములు హంగామా చేయలేదు. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత కూడా రోజా అడపాదడపా టీవీ షోలలో కనిపించి సందడి చేస్తూ ఉంటుంది.పవర్ లో ఉన్నా లేకున్నా తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు రోజా. ఇప్పుడు ఆమె ఏం చేసినా సంచలనమే.

Roja Re Entry : అత్త పాత్రలో అదరగొట్టిన రోజా.. రీఎంట్రీ అదిరిపోయిందిగా..!
Roja Re Entry అదరగొట్టేసింది.
జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో కొత్త సీజన్ మొదలు అయింది. ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఈ షోకు యాంకర్ గా ఉండగా .. రోజా, డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో రోజా ఓ పాపతో కలిసి స్కిట్ చేశారు. అత్త పాత్రలో నవ్వులు పూయించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ శనివారం ఏప్రిల్ 12 రాత్రి 9 గంటలకు జీ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది.
రాజకీయాలలోకి వచ్చిన రోజా ముందు తెలుగుదేశం పార్టీలో చేరి ఫైర్ బ్రాండ్‌గా ముద్ర వేసుకుని 2004, 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె వైఎస్సార్ మరణానంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014, 2019లో వరుసగా రెండు సార్లు నగరి నుంచి గెలుపొందారు. రీసెంట్ ఎన్నికలలో ఓడిపోయారు .
