Poorna : ప్రేమలో పూర్ణ ఓడిపోయిందా?.. ఆమె లవ్ ఫెయిల్యూరా.. అందుకే అలా అన్నదేమో?
Poorna : ప్రేమించిన వారితో జీవితాంతం ఉండటం అదృష్టం.. అది అందరికీ దొరకదు అని ఎవరైనా అన్నారంటే.. దాంట్లో ఎంతో అర్థం ఉండి ఉండొచ్చు. ఇవే మాటలు ఇప్పుడు పూర్ణ నోటి నుంచి వచ్చాయి. ఆమె ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో కనిపిస్తోంది. ఇంద్రజ స్థానంలో పూర్ణ వచ్చింది. గత కొన్ని వారాల నుంచి పూర్ణనే కనిపిస్తోంది. ఢీ షోను మానేసి.. ఆమె ఇక్కడకు వచ్చింది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో పూర్ణ బాగానే సెట్ అయింది. అయితే ఇప్పుడు ఆమె ఓ స్కిట్‌ను చూసి తెగ ఎమోషనల్ అయింది. నూకరాజు, ఆసియా, శాంతి కుమార్ కలిసి చేసిన స్కిట్ అందరినీ కదిలింది.
విషాద ప్రేమ కథను చూపించారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. పరువు హత్యకు గురవుతుంది ఆ జంట. అలా ఆ విషాద ప్రేమ కథను నూకరాజు, ఆసియా, శాంతి కుమార్ కలిసి బాగానే పండించారు. ఆ స్కిట్‌ను చూసి అందరూ కదిలిపోయారు. ఇక ఈ స్కిట్ అనంతరం రష్మీ సైతం ఎమోషనల్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిది రైటో చెప్పలేం.. చాలా కష్టమైన పరిస్థితులు అని రష్మీ చెప్పుకొచ్చింది. ఇలాంటి విషయాల్లో ఎవరిది నిజమో, ఎవరిది రైటో చెప్పలేం.. మన సైడ్ నుంచి చూస్తే అది నిజమే అనిపిస్తుంది.. ప్రేమే గొప్పదనిపిస్తుంది..

Heroine Poorna ABout Love Story And Breakup
అయితే ఇలా హత్యలు చేయడం మాత్రం కచ్చితంగా తప్పే అని పూర్ణ అనేసింది. ప్రేమించిన వాళ్లంతో జీవితాంతం కలిసి ఉండటం.. ఎంతో అదృష్ణం.. అది అందరికీ దొరకదు.. ఇక్కడ చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వారున్నారు.. అందరికీ కంగ్రాట్స్ అని పూర్ణ ఓ నిస్తేజంలో అనేసింది. ఆమె మాటలు వింటుంటే.. బ్రేకప్ స్టోరీ ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి పూర్ణ ఈ మధ్యే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌లో వ్యాపారవేత్తను పూర్ణ పెళ్లి చేసుకోబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పూర్ణకు కాబోయే భర్త ఫోటోలు నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.