Himaja : వత్తితే సన్నం అవుతుందట.. చీ ఛీ హిమజ మరీ దారుణం
Himaja : బుల్లితెరపై డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాజ్యమేలుతుంటాయి. ఇప్పుడు వచ్చే కామెడీ షోలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు అన్నీ కూడా వాటిపైనే ఆధారపడి ఉంటాయి. ఈ రేసులో జబర్దస్త్ షోనే ముందుంటుంది. అందులోనూ హైపర్ ఆది వంటివాడు ఇంకా ముందుంటాడు. అయితే ఈ హైపర్ ఆదినే మొహం పక్కకు తిప్పుకునేలాంటి చెత్త కామెంట్ చేసింది హిమజ.
తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ యోధకు ఫంక్షన్ చేశారు. సారీ ఫంక్షన్ అంటూ నానా హంగామా చేశారు. ఇక ఆడవాళ్లంతా కూడా కోన్స్ పెట్టుకునే పనిలో పడ్డారు. ఎర్రగా పండితే త్వరగా పెళ్లి అవుతుందట అని ఒకరు సెటైర్ వేస్తారు. పెళ్లే త్వరగా అవుతుందా? ఇంకేం కాదా? అని సుధీర్ అడుగుతాడు.

Himaja Counters In Sridevi Drama Company
Himaja : దిగజారిన హిమజ..
నీకు పెళ్లి మాత్రమే కాలేదు కదా? అందుకే అదే అవుతుంది అని ఇంద్రజ సెటైర్ వేస్తుంది. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తుంటారు. అయితే ఆ తరువాత ఓ సీరియల్ నటి కోన్‌ను చూపిస్తుంది. ఇదేంటి ఇంత పొడుగ్గా, లావుగా ఉందని కామెంట్ చేస్తుంది. దీన్ని సన్నగా చేయడం ఎలా అని అడుగుతుంది. వత్తాలి అని హిమజ దారుణంగా మాట్లాడుతుంది. తరువాత తనది తానే తల కిందకు వేసుకుని నవ్వుతుంది. ఆది అయితే దెబ్బకు లేచి వెనక్కి వెళ్లి తలదాచుకుంటాడు.