Himaja : ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం అందరికి తెలిసిందే. ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడానికి నటీమణులు కాస్త వెనుకడుగు వేసేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఓపెన్‌గా తాము ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితులు, పరిశ్రమలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే దానిపై మాట్లాడుతున్నారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ హిమజ సంచలన కామెంట్స్ చేసింది. తెలుగు అమ్మాయి అయిన హిమజ సీరియల్ నటిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం వంటి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. పలు షోలకి యాంకరింగ్ కూడా చేసింది. ఇక 2016లో విడుదలైన శివమ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన హిమజ తెలుగులో.. నేను శైలజ, జనతా గ్యారేజ్, ధ్రువ, మహానుభావుడు, శతమానం భవతి వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ పోషించింది.
హీరోయిన్ మెటీరియల్ అయిన హిమజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గరే ఆగింది. అయితే తెలుగు అమ్మాయిలకి టాలీవుడ్‌లో అంతగా ఆఫర్స్ రాకపోవడం వెనక షాకింగ్ కామెంట్స్ చేసింది హిమజ. తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ గా ఉంటారనే వాదన ఉంది. అందుకే వాళ్లకు ఆఫర్స్ రావడం లేదంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటని హిమజని యాంకర్ ప్రశ్నించగా, దానికి ఆమె దిమ్మతిరిగిపోయే సమాధానం చెప్పింది. తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ కాదని ఇప్పటికే నిరూపితమైంది. విషయం ఏమిటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ ఆఫర్స్ రావడం లేదు. అవకాశాలు వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చినవాళ్లు కాదు అని చెప్పుకొచ్చింది.
అయితే కొందరికి ఆఫర్స్ వస్తున్నా కూడా అత్యాశ వలన అవి చేజారిపోతున్నాయి.అయితే మన తెలుగు అమ్మాయిలకి అవకాశం ఇవ్వకుండా కన్నడ, మలయాళ భామలకి అవకాశాలు ఇవ్వడానికి కారణం ఉంది. కొన్ని పాత్రలకి కొందరే సెట్ అవుతారని వారిని తీసుకుంటున్నారని హిమజ పేర్కొంది. ఇక హిమజ బిగ్ బాస్ షోతో కూడా బాగా పాపులర్ అయింది. సీజన్3లో హౌజ్‌లో అడుగుపెట్టిన హిమజ 9 వారాల పాటు సందడి చేసింది. ఆ సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ విజేత కాగా, శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. అయితే బిగ్ బాస్ షో తర్వాత హిమజ లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తుంది. దానిపై పలు విమర్శలు కూడా వచ్చాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.