Ajwain Tea : అందరూ టీ, కాఫీలు సహజంగా తాగుతూ ఉంటారు. కొందరైతే టీ, కాఫీలు తాగకుండా ఏ పని మొదలు పెట్టరు. అయితే పాలతో తయారుచేసిన టీ, కాఫీల కన్నా వాము టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.. పూర్వం మసాలా దినుసులలో వాము ఒకటి. దీనిని ఆంగ్లంలో అజ్వైన్ అని పిలుస్తారు. వేసవిలో కచ్చితంగా తాగాల్సిన డ్రింకులలో ఇది ఒకటి. ఖాళీ కడుపుతో ఒక కప్పు వాము టీ తాగడం వలన జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో కూడా అజ్వైన్ ను శక్తివంతమైన కేల్న్సర్ గా చెప్తారు. అజ్వైన్ తీసుకోవడం వలన కడుపుబ్బరం ఎసిడిటీ మలబద్దకం లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వామును నిత్యం తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
ఈ మసాలా దినుసు అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడంతోపాటు బ్యాక్టీరియా ఫంగస్ లతో పోరాడడానికి ఉపయోగపడుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయకారిగా ఉంటుంది. వాము పెప్టిక్ అల్సర్లను తగ్గిస్తుంది.
వేసవికాలంలో ఖాళీ కడుపుతో వాము టీ తాగడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం…
-జీవ క్రియను మెరుగుపరుస్తుంది: వాము టీ జీవ క్రియను పెంచుతుంది. ఇది బరువు నిర్వహణకు ఉపయోగపడుతుంది. వాము టీ మొత్తం జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన జీవ క్రియ వలన బరువు కంట్రోల్లో ఉంటుంది.
వాము టీ తీసుకోవడం వలన అదనపు ప్రయోజనం కూడా కలుగుతుంది. అదే డీటాక్సిఫికేషన్ . వాము తినడం వల్ల మూత్ర విసర్జన సవ్యంగా జరుగుతుంది. మూత్ర విసర్జన ద్వారా వ్యర్ధాలు విషాలను బయటకు తీయడానికి శరీరానికి ప్రోత్సహిస్తుంది.
ఉబ్బరం గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించుకోవడానికి వాము టీ ఉత్తమం. వాములో ఉండే కార్మినేటివ్ లక్షణాలు గ్యాస్ కడుపుబ్బరం లాంటివి రాకుండా రక్షిస్తాయి.
-ఆకలిని పెంచుతుంది: వాము టీ ఆకలిని పెంచుతుంది. వేసవి వేడి ఆకలి వేయకుండా అడ్డుకుంటుంది. ఈ టీ తాగడం వలన ఆకలి వేస్తుంది. వాము టీ జీర్ణ వ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ఆకలిని పెంచుతుంది.
-వాము టీ జీర్ణక్రియను పెంచుతుంది. పొట్ట ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. వాములోని తైమెల్ ఇతర క్రియశీల పదార్థాలు గ్యాస్ట్రిక్ రసాలను ప్రేరేపించడానికి ఉపయోగపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం అసిడిటీ లాంటి లక్షనాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి భోజనం తర్వాత కడుపునొప్పి వస్తుంది. అలాంటి వారికి ఇది గొప్ప ఔషధం లాగా ఉపయోగపడుతుంది.
వాము టీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. ఒక కప్పు వేడి నీటిలో ఒక టీ స్పూన్ వాము వేసి బాగా మరిగించాలి. అంతే వాము టీ రెడీ అయిపోతుంది. కొన్ని నిమిషాల తర్వాత దానిని వడకట్టి ఒక కప్పులో పోసుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. దీనిలో రుచి కోసం తేన, బ్లాక్ సాల్ట్, నిమ్మరసం లాంటివి కూడా కలుపుకోవచ్చు..
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.