Ys Vijayamma : ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం మరింత రసవత్తరంగా సాగుతుంది. ముఖ్యంగా జగన్, షర్మిళ మధ్య పోరు హాట్ టాపిక్ అవుతుంది. సీఎం జగన్ ఒకవైపు.. షర్మిల మరోవైపు చేరి.. ఎన్నికల్లో పోటీకి సై అంటే సై అంటున్నారు. షర్మిలపై జగన్ ప్రత్యక్షంగా విమర్శలు చేయకపోయినా.. ఆ పార్టీనేతలు మాత్రం ఈమెని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. ఇక షర్మిల, సునీత కలిసి జగన్ ని ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పీక్స్‌లో ఉన్నటైమ్‌లో విజయమ్మ అమెరికాకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కుమారుడు, మరోవైపు కుమార్తె ఇద్దరూ చెరో దారిలో వెళ్తున్న టైంలో తల్లి విజయమ్మ సపోర్ట్ ఎవరికి ఉంటుందనే ఆసక్తి అందరిలో కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ఉన్నప్పుడు షర్మిలకు తల్లిగా విజయమ్మ సపోర్ట్ చేశారు. ఏపీ రాజకీయాల్లో ఆమె వచ్చిన తర్వాత విజయమ్మ సైలెంట్ అయిపోయారు. ఇక గత ఎన్నికల్లో కుమారుడు జగన్ విజయం కోసం తెగ తాపత్రయ పడిన విజయమ్మ ఈ సారి మాత్రం మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేనట్టే కనిపిస్తుంది. ఈ సారి ఎక్కడ కూడా జగన్‌కి పాజిటివ్‌గా మాట్లాడింది లేదు. దీనిని బట్టి చూస్తుంటే విజయమ్మ మద్దతు షర్మిళకే గట్టిగా ఉందని అర్ధమవుతుంది. ఆమె తల్లి విజయమ్మ అమెరికాకి వెళ్లగా అక్కడి నుండి వీడియో ప్రచారం చేయించాలని షర్మిళ భావిస్తుందట. ఈ విషయంలో జగన్‌ని ఫాలో అవుతుంది షర్మిళ.
వైఎస్ రాజశేఖరెడ్డి నలుగురు అన్నదమ్ములకు ఒకే ఒక్క ఆడపడుచు విమలమ్మ. ఆమె మొదటి నుండి జగన్ కు, అవినాష్ కు సపోర్ట్ చేస్తూ వస్తుంది. నేను మీ మేనత్తను… వైఎస్ కుటుంబానికి ఆడపడుచును. వివేకం అన్న, రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రేమించే సోదరిని. పులివెందుల, కడప ప్రజలకు జగన్, అవినాష్ కు అండగా ఉండాలని కోరింది. ఈ ఎపిసోడ్ లో విజయమ్మను ఇన్వాల్స్ చేయించాలని జగన్ అండ్ కో కోరినా… షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడలేక అలాగని జగన్ విజ్ఞప్తిని కాదనలేకే విజయమ్మ అమెరికాకి వెళ్లి పోయిందనే ప్రచారం ఉంది. అయితే జగన్ ఎలా అయితే విమలమ్మతో వీడియోలు చేయించి వదులుతున్నాడో షర్మిళ కూడా తన తల్లితో అమెరికా నుండి వీడియోలు చేయించి ప్రచారానికి వాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు టాక్.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.