Sarkaru Vaari Paata : మహేశ్ బాబు లాంటి హీరో మెసేజ్ ఇవ్వకపోతే ఎలా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sarkaru Vaari Paata : మహేశ్ బాబు లాంటి హీరో మెసేజ్ ఇవ్వకపోతే ఎలా..?

 Authored By govind | The Telugu News | Updated on :8 May 2022,10:00 am

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎక్కువగా ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలతో మెసేజ్ ఇస్తూ వస్తున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి గత చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఆ తరహాలో వచ్చినవే. మిగతా హీరోలు సోషల్ మెసేజ్ కంటే కూడా కమర్షియల్ హిట్ కోసమే పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు. కానీ, మహేశ్ రియల్ లైఫ్‌లో రీల్ లైఫ్‌లో సోసైటీ కోసమే అనేట్టుగా తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్స్, సోషల్ మేసేజ్ కలిసి ఉన్న సినిమాలనే గత నాలుగైదేళ్ళుగా మహేశ్ చేస్తూ వస్తున్నారు.

అయితే, ఇప్పుడు రాబోతున్న సర్కారు వారి పాట సినిమాలో ఈ మేయిన్ ఎలిమెంట్ మిస్ అయినట్టు తెలుస్తోంది. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు గీత గోవిందం ఫేమ్ పరశురాం పెట్లా దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీదీ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. అంతేకాదు, సర్కారు వారి పాట సినిమాలో పోకిరి వైబ్స్ ఉన్నాయని అంచనాలు అమాంతం పెంచారు. థమన్ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో అంచనాలు ఇంకో రేంజ్‌కు చేరుకున్నాయి.

How can a hero like Mahesh Babu not give a message

How can a hero like Mahesh Babu not give a message

Sarkaru Vaari Paata: ఇదే నిజమైతే కాస్త జనాలకు ఎక్కడం డౌటే అంటున్నారు.

అయితే, సర్కారు వారి పాట సినిమాలో ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే ఆశించాలని మేసేజ్ మాత్రం ఆశించవద్దనే విధంగా మేకర్స్ హింట్ ఇస్తున్నారు. అయితే, గత నాలుగు సినిమాలో సాలీడ్ సోషల్ మెసేజ్ ఇచ్చిన మహేశ్ ఇప్పుడు మాత్రం జస్ట్ ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే ఇస్తే సరిపోతుందా అభిమననులకు ఇది సంతృప్తినిస్తుందా అని ఇప్పుడు సోషల్ మీడియాలో కామెనెట్స్ వినిపిస్తున్నాయి. మరి మెసేజ్ ఉన్నా కూడా థ్రిల్ కోసం ఆ విషయాన్ని మేకర్స్ చెప్పలేదా అనేది తెలియదు గానీ, ఇదే నిజమైతే కాస్త జనాలకు ఎక్కడం డౌటే అంటున్నారు. అయితే పక్కా ఎంటర్‌టైన్మెంట్‌తో వచ్చిన సినిమాలు భారీ హిట్స్ అందుకున్నాయి. చూడాలి మరి సర్కారు వారి పాట రిజల్ట్ ఎలా వస్తుందో. కాగా, ఈ సినిమా మే 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది