Simhadri Movie : సింహాద్రిలో నటించిన హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే?
Simhadri Movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అంకిత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదనుకుంట.. రస్నా జ్యూస్ యాడ్‌తో తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన అంకిత.. ఆ తర్వాత వెండితెరపై మెరిసింది. నందమూరి హరికృష్ణ, సుమన్, భానుప్రియ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన లాహిరి లాహిరి లాహిరీలో సినిమాలో అంకిత తెరంగేట్రం చేసింది. తొలి సినిమా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి మంచి అవకాశాలు వచ్చాయి.
Simhadri Movie : సింహాద్రితో సూపర్ క్రేజ్
ఇక కొంతకాలానికి దర్శకధీరుడు తెరకెక్కించిన సింహాద్రి చిత్రంలో ఎన్టీఆర్ సరసన అంకిత నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో ఇక ఈ అమ్మడుకు తిరుగులేకుండా పోయింది. దీంతో విజయేంద్ర వర్మ, వినాయకుడు,స్టేట్ రౌడీ, అనసూయ వంటి చిత్రాల్లో నటించిన అంకిత ఆ తర్వాత ఎందుకో వెనుకబడిపోయింది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లినా అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవడంతో అంకిత నెమ్మదిగా సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఆమెపై రూమర్లు కూడా అప్పట్లో చక్కర్లు కొట్టాయి. కోలీవుడ్ హీరోతో రిలేషన్‌లో ఉందని వార్తలు వైరల్ అవ్వడంతో అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు మకాం మార్చింది.

How has the Simhadri Movie heroine changed so much
కథల ఎంపిక విషయంలో అంకిత తప్పటడుగు వేయడం వల్లే ఆమె కెరీర్ మధ్యలో ముగిసి పోయిందని టాక్ వినిపిస్తోంది. ఆమె నటించిన చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ తీవ్ర నిరాశకు గురైందట.. ఈ కారణంతో ఇండస్ట్రీకి దూరమైన అంకిత పూణెకి చెందిన బిజినెస్ పర్సన్ విశల్ ఝాటక్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. అంకితకు ఒక బాబు కూడా ఉన్నాడు.అంకిత వాళ్ళ తండ్రి అప్పట్లో వజ్రాల వ్యాపారం చేస్తుండేవాడు. ఆ తర్వాత అంకిత కూడా వజ్రాల వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తూ స్థిరపడిపోయింది. అయితే, మళ్లీ మీరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతారా అని ఎవరో అడిగితే లేదు రాలేనని అంకిత కరాఖండీగా చెప్పేసిందట..