Pushpa : ప్రస్తుతం పుష్ప మానియా మాములుగా లేదు. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశమంతా పుష్ప మానియా నడుస్తుంది. క్రికెటర్స్ అయితే పుష్ప ట్రాన్స్‌లో మునిగి తేలుతున్నారు. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సినీ ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. అతీశ్ ఖరడే అనే ట్రాఫిక్ పోలీస్ ఏకంగా శ్రీ వల్లి అనే పాటకు మరాఠీలో లిరిక్స్ రాసి మరీ ఆలపించాడు. అంతటితో ఆగకుండా అచ్చం బన్నీలాగే స్టెప్స్ వేశాడు కూడా. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రముఖ వాణిజ్య సంస్థ ‘అమూల్’ తన వ్యాపారం కోసం ‘పుష్పక్ ది స్లైస్.. అమూల్ హావ్ సమ్ అమ్ములు, అర్జున్..’ అనే కార్టూన్‌ను షేర్ చేసింది. దీనికి బన్నీ కూడా స్పందించాడు. దీంతో ఆ వాణిజ్య ప్రకటన వైరల్‌గా మారింది. తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పుష్పరాజ్‌ను వాడటం ఆసక్తికరంగా మారింది. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలనే నియమం గురించి ప్రజలలో అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా పుష్ప సినిమాలో బైక్‌పై వెళుతున్న అల్లు అర్జున్ హెల్మెట్ ధరించి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారు.
ఆ ఫోటోపై మళ్ల తగ్గేదే లే అని రాసారు. ఈ ఫొటోని ట్రాఫిక్ పోలీస్ ట్విటర్ పేజీలో షేర్ చేశారు. ‘హెల్మెట్ ధరించండి. అది మిమ్మల్ని కాపాడుతుంది.’ అంటూ ట్వీట్ చేశారు పోలీసులు. ఇక ఈ సినిమాలోని పాటలకు ఫుల్ రెస్పాన్స్ రావడంతో ప్రతి ఒక్కరు ఇందులోని ఏదో ఒక పాటకు తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ రచ్చ లేపుతున్నారు. సమంత చేసిన ఊ అంటావా మావ పాటకు హుషారుగా డ్యాన్స్ చేస్తూ కేక పెట్టిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.