Hyper Aadi – Ram Prasad : వీళ్లతో పెట్టుకుంటే ఇంతే!.. ఆడేసుకున్న ఆది, రాం ప్రసాద్

Authored By aruna | The Telugu News | Published on: August 15, 2022, 6:20 pm

Hyper Aadi – Ram Prasad : హైపర్ ఆది రాం ప్రసాద్ ఇద్దరూ ఇద్దరే. పంచులు వేయడంలో ఒకరు ఫేమస్ అయితే.. ఆటో పంచులు వేయడంలో ఇంకొకరు ఫేమస్. స్పాంటేనియస్ పంచులు వేస్తూ ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ దూసుకుపోతోన్నారు. ఈ ఇద్దరి కామెడీ వల్లే శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇప్పుడు దుమ్ములేపేస్తోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ వరుసగా పంచులతో రెచ్చిపోయారు.

వాళ్లిద్దరూ అందరి దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టారట. ఇక అందరూ అప్పు అడగటానికి వచ్చారు. దీంతో ఒక్కొక్కరి మీద ఒక్కో రకమైన కౌంటర్లు వేశారు. మా దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేస్తావా? అని ఫైమా అంటే.. మోసం గురించి నువ్వు, ప్రవీణ్, నూకరాజే మాట్లాడాలంటూ కౌంటర్లు వేశారు. నా అప్పు రోజు రోజుకూ పెరుగుతోంది అని నరేష్ అంటాడు. మరి అప్పు కూడా పెరుగుతోంది.. కానీ నువ్ మాత్రం పెరగడం లేదన్నట్టుగా నరేష్ పరువుతీస్తాడు ఆది.

Hyper Aadi And Ram Prasad Counters on Sridevi Drama Company

Hyper Aadi And Ram Prasad Counters on Sridevi Drama Company

Hyper Aadi – Ram Prasad : ఫైమా పరువుతీసిన ఆది..

నీకు అప్పిచ్చిన పాపానికి జనాలు అంతా నా మొహం మీద ఊస్తున్నారు.. నా మొహం ఎక్కడ పెట్టుకోవాలో నాకు తెలియడం లేదు అని పవిత్ర అంటుంది. ఇంకా ఎక్కడా పెట్టకు.. అసలే ఎక్కడెక్కడో పెట్టినట్టు ఉంది అంటూ పవిత్రను దారుణంగా కించపరుస్తాడు. దీని కంటే ముందు ఇంకో పంచ్ వేస్తాడు. ఇవన్నీ పక్కన పెట్టేయండి.. ముందు నా అప్పు తేల్చండి అని పవిత్ర అంటుంది.

అసలు నిన్నే పక్కన పెట్టేయమని చెప్పాం కదా? ఇంకా తీసేయలేదా? అని ఆది కౌంటర్లు వేస్తాడు. ఇలా ఒక్కొక్కరినీ తమ పంచులతో ఆడేసుకుంటూ వరుసగా కామెడీ పండించారు. ఈ ఇద్దరే ఈ షోకు బలమని ఎందుకు అంటారో ఈ పంచులతోనే అర్థమై ఉంటుంది.

aruna

No bio available for this author.

  1. "Janasena Party : కూటమిలో ఉంటూనే జనసేన సొంత బలం పెంచుకుంటోందా?.. ప‌వ‌న్‌ది ఏం ప్లాన్ గురూ..!"

  2. "WhatsApp Web : వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. ఈ చిన్న తప్పుతో మీ అకౌంట్ ప్రమాదంలో పడొచ్చు!"

  3. "Trisha Politics : మరో జయలలితగా త్రిష?.. విజయ్‌తో రాజకీయాల్లోకి వస్తారా? అభిమానుల కొత్త ప్లాన్!"

  4. "Farmers Income : పంటల కంటే కూలీ పనులతోనే ఎక్కువ ఆదాయం.. రైతులపై NSO సర్వేలో సంచలన విషయాలు!"

  5. "Indiramma Bima : రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా కోసం ఈ పత్రాలు చాలు.. డిసెంబర్ 18 వరకే చాన్స్‌..!"

  6. "Gold Rate Today : 24 నవంబర్ 2026 మళ్లీ షాకిస్తున్న బంగారం.. వరుసగా రెండో రోజూ పెరిగిన పసిడి ధరలు..!"

  7. "Bigg Boss Telugu 10 : రష్మిక మందన్నాకు కాలేజీ సీనియర్ ఈ కంటెస్టెంటా?.. నేషనల్ క్రష్‌కు ఊహించని సర్‌ప్రైజ్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp